ఏప్రిల్ - 11,2014
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన 'నైట్ గ్రాండ్ క్రాస్ (జీబీఈ)' అవార్డు లభించింది. బ్రిటన్, భారత్ మధ్య సంబంధాలు; బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చేసిన కృషి, దాతృత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదగా దీన్ని అందుకుంటారని బ్రిటన్‌కు చెందిన ఫారెన్ అండ్ కామన్‌వెల్త్ ఆఫీస్ (ఎఫ్‌సీఓ) వెల్లడించింది. 2014కి అయిదుగురు విదేశీయులకు గౌరవ బ్రిటిష్ అవార్డులను ప్రకటించారు. అందులో రతన్ టాటా ఒకరు.
» 2009లో టాటాకు నైట్ కమాండర్ (కేబీఈ) అవార్డు ఇచ్చి బ్రిటన్ సత్కరించింది. ఆయన నేతృత్వంలోని టాటా గ్రూప్ బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ లాండ్ రోవర్‌ను కొనుగోలు చేసిన ఏడాదికి ఈ పురస్కారం లభించింది. జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్)ను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని గాడిలోకి తీసుకురావడంలో టాటా గ్రూప్ విజయం సాధించింది. టాటా గ్రూప్ బ్రిటన్‌లో దాదాపు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.

No comments:
Post a Comment