మార్చి - 10,2014
కవి, పరిశోధకుడు, బహు భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్యంలో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. |
» ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన 'స్మారక శిళగల్' నవలను డాక్టర్ నలిమెల భాస్కర్ 'స్మారక శిలలు' పేరిట తెలుగులోకి 2010 లో అనువదించారు. ఈ రచనను అనువాద సాహిత్య విభాగంలో జాతీయ పురస్కారానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. » పురస్కారం కింద రూ. 50 వేల నగదు, ప్రశంసాపత్రం, సత్కారాన్ని ఆయన అందుకోనున్నారు. » మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'వేయి పడగలు' నవలను 'సహస్ర ఫణ్' పేరిట హిందీలోకి అనువదించారు. దీనికి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దీంతో అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన కరీంనగర్ జిల్లా సాహితీ వేత్తల్లో డాక్టర్ నలిమెల భాస్కర్ రెండోవ్యక్తిగా నిలిచారు. |
No comments:
Post a Comment