మార్చి - 21,2014
ప్రతిష్ఠాత్మక 'జీడీ బిర్లా పురస్కారం-2013'కు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్ ఎన్నికయ్యారు. 46 ఏళ్ల రాజేశ్ అలహాబాద్‌లోని హరీష్ చంద్ర పరిశోధన సంస్థలో భౌతిక శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. క్వాంటం ఫీల్డ్ సిద్ధాంతానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకుగాను ప్రముఖ శాస్త్రవేత్తలు అసిస్ దత్తా, అనుపమ్ వర్మ నేతృత్వంలోని ఎంపిక కమిటీ రాజేశ్‌ను ఎంపిక చేసింది. ఈ పురస్కారం కింద ఆయనకు రూ.1.5 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు. » రాజేశ్ 2004లో బీఎం బిర్లా సైన్స్ ప్రైజ్‌తో పాటు పలు పురస్కారాలు గెలుచుకున్నారు. దేశంలోనే ఉంటూ పనిచేసే 50 ఏళ్లలోపు శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించే లక్ష్యంతో 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది.

No comments:
Post a Comment