Wednesday, July 23, 2014

'పరమ్ యువ-2' సూపర్ కంప్యూటర్

jan1,2014  
భారత శాస్త్రవేత్తలు రూపొందించిన'పరమ్ యువ-2' సూపర్ కంప్యూటర్ ప్రపంచంలో విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకునే కంప్యూటర్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది.
          » అమెరికాలోని డెన్వర్‌లో జరిగిన సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ (ఎస్‌సీ 2013)లో ఈ మేరకు 'గ్రీన్ 500' జాబితా విడుదల చేశారు.
          » కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్డ్స్ కంప్యూటింగ్ (సి-డాక్) తయారు చేసిన పరమ్ యువ-2 సూపర్ కంప్యూటర్ దేశంలో మొదటి స్థానంలో ఆసియాలో 9వ స్థానంలో, ప్రపంచంలో 44వ స్థానంలో నిలిచింది.
          » విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునే కంప్యూటర్లకు 'గ్రీన్-500' ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment