మార్చి - 25,2014
మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పనిముట్ల విభాగం ప్రకటించిన 'మహీంద్రా సమృద్ధి ఇండియా అగ్రి అవార్డ్స్ - 2014'లో నల్గొండకు చెందిన కర్రా శశికళ ఉత్తమ మహిళా రైతు అవార్డు గెలుచుకున్నారు. ఆమెను 'మహీంద్రా సమృద్ధి కృషి ప్రేరణా సమ్మాన్' అవార్డుతో సత్కరించారు. విజేతలకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్ అవార్డులు అందజేశారు. |
» పొలానికి అవసరమైన విద్యుత్తు కోసం శశికళ బయోగ్యాస్‌ను వినియోగించారు. తద్వారా ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి ఎరువులు వినియోగించకుండా వరి సాగు చేపట్టారు. కేవలం సంప్రదాయ ఎరువు అయిన ఆవుపేడను మాత్రమే వినియోగించారు. » 'మహీంద్రా సమృద్ధి కృషి శిరోమణి సమ్మాన్ (జీవన సాఫల్య పురస్కారం) -2014' అవార్డు వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ కె.ఎల్.చద్దాకు లభించింది. » రైతుల శక్తియుక్తులను గుర్తించే లక్ష్యంతో 2011 నుంచి ఈ అవార్డులు ఇస్తున్నారు. |
No comments:
Post a Comment