జూన్ - 13,2014
దేశవ్యాప్తంగా ఇంధన ప్రమాణాలను పెంచాలని నిపుణుల కమిటీ సూచించింది.
» ప్రణాళికాసంఘం మాజీ సభ్యుడు సౌమిత్ర చౌధురి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. యూరో-5 ప్రమాణాలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ను ఉత్పత్తి చేయడానికి చమురుశుద్ధి కర్మాగారాలను ఆధునికీకరించాలని ఈ కమిటీ సూచించింది. దీనికి రూ.80 వేల కోట్లు అవసరమని పేర్కొంది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి పెట్రోలు, డీజిల్‌పై 75 పైసల మేర సెస్ విధించాలని తెలిపింది. 2014-15 నుంచి 2021-22 మధ్య ఏడేళ్ల వ్యవధిలో ఈ సెస్ ద్వారా రూ.64వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు.
» 2017 నాటికి దేశవ్యాప్తంగా దశలవారీగా యూరో-4 ఇంధన ప్రమాణాలను తీసుకురావాలని, 2020 నాటికి యూరో-5 స్థాయిని అందుకోవాలని కమిటీ సూచించింది. 2024 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వస్తాయి.
» ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్, లక్నో తదితర 26 నగరాల్లో యూరో-4 (బీఎస్-4) ప్రమాణాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల బీఎస్-3 స్థాయి అమల్లో ఉంది.
» చమురుశుద్ధి కర్మాగారాల ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు వీలుగా డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని కమిటీ సూచించింది. పెట్రోల్ ధరలపై నియంత్రణను 2010 జూన్‌లో తొలగించారు.

saumitra chaudhuri |
No comments:
Post a Comment