» ఈ తరహా మాంసం తయారీకి సంబంధించి ఆయన ప్రతిపాదనలను కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వశాఖ ఆమోదించడంతో పాటు పరిశోధనలకు అవసరమైన నిధులనూ మంజూరు చేసింది. » గీతం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ కె.అరుణలక్ష్మి, పర్యావరణశాస్త్ర విభాగానికి చెందిన సిహెచ్.రామకృష్ణ సహకారంతో కోడి కండ నుంచి సేకరించిన మూలకణాల ఆధారంగా కృత్రిమ మాంసం తయారీ ప్రయోగాలు చేశారు. ఫలితాలు సానుకూలంగా రావడంతో పెద్దఎత్తున మాంసం తయారు చేసే అవకాశాలపై దృష్టి సారించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ధరకే మంచి పోషకాలున్న కృత్రిమ కోడి మాంసం అందుబాటులోకి వస్తుంది.
» ప్రయోగశాలలో కృత్రిమంగా రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ కోడి మాంసాన్ని 'ఇన్‌విట్రో చికెన్', 'టెస్ట్‌ట్యూబ్ చికెన్' అని అంటారు. సాధారణ కోడి నుంచి మాంసం తీసే క్రమంలో పావువంతు వృథా అవుతుంది. కృత్రిమ కోడి మాంసంలో వ్యర్థాలకు తావేలేదు. కోడి మూల కణాల నుంచి అభివృద్ధి చేయడం వల్ల రంగు, రుచి, వాసనలో ఏమాత్రం తేడా ఉండదని సత్యనారాయణ పేర్కొన్నారు.
» ఇన్‌విట్రో చికెన్‌లో కావాల్సిన స్థాయికి కొవ్వు శాతాన్ని పరిమితం చేసుకోవచ్చు. అవసరమైన ఇతర పోషకాలనూ జతచేసుకుని 'డిజైనర్ మీట్' ఉత్తత్తి చేయవచ్చు. మరోవైపు సాధారణ కోళ్లలో వచ్చే బర్డ్‌ఫ్లూ వంటి వ్యాధుల సమస్య కూడా ఉండదు.
» సత్యనారాయణ గతంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగం (డి.ఎస్.టి.) నుంచి 'యువ శాస్త్రవేత్త' అవార్డు అందుకున్నారు.
|
No comments:
Post a Comment