మే - 18,2014
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ప్రయోగించిన నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ - NOTA)కు అనూహ్య స్పందన లభించింది. బరిలో నిలిచిన అభ్యర్థులపై అసంతృప్తికి ఇది అద్దం పడుతోంది.
» ఈ సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులపై ఓటర్ల అసంతృప్తి భారీగానే వెల్లడయింది. దేశవ్యాప్తంగా ఈ ఆప్షన్‌ను రికార్డు స్థాయిలో 59,97,054 మంది ఓటర్లు వినియోగించుకున్నారు.
» దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 1.1% నోటా ఓట్లే. జేడీయూ, జేడీఎస్ తదితర 21 పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే నోటా ఓట్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.
» కేంద్ర మంత్రి ఎ.రాజా బరిలో దిగిన తమిళనాడు లోని నీలగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 46,559 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఒడిషాలోని నబరంగ్‌పూర్‌లో 44,405 ఓట్లు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ నియోజకవర్గంలో 38,772 ఓట్లు, రాజస్థాన్‌లోని బాన్స్‌వారా నియోజకవర్గంలో 34,404, ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నందగావ్ నియోజక వర్గంలో 32,384 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
» శాతాల వారీగా చూస్తే పుదుచ్చేరి తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం 22,268 నోటా ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 3%.
» ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 80 నియోజక వర్గాల్లో అత్యధికంగా 5.92 లక్షల ఓట్లు నోటాకు పోలయ్యాయి. కానీ ఇవి మొత్తం పోలైన ఓట్లలో 0.7% మాత్రమే.
» ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 1,85,504 ఓట్లు నోటాకు వచ్చాయి. అత్యధికంగా అరకు పార్లమెంటరీ నియోజక వర్గంలో 16,532 ఓట్లు నమోదయ్యాయి. తక్కువగా 4,358 కాకినాడలో వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో సగటున 7,420.16 ఓట్లు నోటాకు వచ్చాయి.
» తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 1,54,581 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. అత్యధికంగా ఆదిలాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో 17,084 ఓట్లు వచ్చాయి. ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో అతి తక్కువగా 4,938 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం పరిధిలో సగటున 9,093 ఓట్లు నోటాకు వచ్చాయి.
» భాజపా ప్రధాని అభ్యర్థి మోడీ పోటీ చేసిన గుజరాత్‌లోని వడోదరాలో 18,053 నోటా ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ నోటాదే మూడో స్థానం.

No comments:
Post a Comment