మార్చి - 5,2014
హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్‌కు ప్రతిష్ఠాత్మక కేస్ అవార్డ్ లభించింది. యూకేకి చెందిన 'ది కేస్ సెంటర్' ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తుంది. ఒక ప్రత్యేక అంశానికి సంబంధించి అత్యుత్తమ అధ్యయనం, లేఖనానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ అవార్డు గుర్తింపును ఇస్తుంది. |
» 'డిజిటల్ మార్కెటింగ్ ఎట్ నైక్: ఫ్రం కమ్యూనికేషన్ టు డైలాగ్' శీర్షికన జరిపిన కేస్ స్టడీకి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. 'నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్' విభాగంలో ఈ అవార్డు లభించింది. » పోటీ పూర్వక మార్కెట్‌లో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం 'నైక్' ఎలా విజయం సాధించగలిగిందనేది ఈ అధ్యయన సారాంశం. |
No comments:
Post a Comment