జూన్ - 25,2014
|
¤ వరి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్వింటాలుకు సాధారణ రకం ధాన్యం కనీస మద్దతు ధరను ప్రస్తుతమున్న రూ.1310 నుంచి రూ.1360 కి (పెరుగుదల రూ.50) పెంచగా, ఏ గ్రేడ్ రకం ధాన్యం ధరను క్వింటాలుకు రూ.1345 నుంచి రూ.1400 కి (పెరుగుదల రూ.55) పెంచింది. 2014-15 పంట ఏడాదికి వర్తించే ఈ కొత్త ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. » ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ వ్యయధరల కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా ధరలను పెంచింది. » సీసీఈఏ నిర్ణయించిన ఇతర పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు (క్వింటాలకు) ఇలా ఉన్నాయి. » మొదటి రకం పత్తిబేళ్లు రూ.4000 నుంచి రూ.4050 » రెండో రకం పత్తిబేళ్లు రూ.3700 నుంచి రూ.3750 » కందిపప్పు, మినపపప్పు రూ.4300 నుంచి రూ.4350 » పెసరపప్పు రూ.4500 నుంచి రూ.4600 » సన్‌ఫ్లవర్ రూ.3700 నుంచి రూ.3750 » నువ్వులు రూ.4500 నుంచి రూ.4600 » హైబ్రిడ్ జొన్నలు రూ.1500 నుంచి రూ.1530 » రాగులు రూ.1500 నుంచి రూ.1550 » సజ్జలు (రూ.1250), మొక్కజొన్న (రూ.1310), వేరుశెనగ (రూ.4000), సోయాబీన్ (రూ.2500 - రూ.2560) ధరలను అలాగే కొనసాగించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. |
Wednesday, July 23, 2014
కనీస మద్దతు ధరలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment