అసోచామ్ మహిళా విభాగం హైదరాబాద్ ఛాప్టర్ 'ఈ దశాబ్దపు మహిళా సాధక అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు అవార్డులు అందజేశారు. |
|
» అసోచామ్ మహిళా విభాగం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ఈ దశాబ్దపు మహిళా సాధకురాలు (ఉమెన్ ఆఫ్ ద డికేడ్ అచీవర్స్) పురస్కారాన్ని ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి నుంచి 11 మంది మహిళలు ఈ అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలు
సానియామీర్జా - క్రీడలు
జె.గీతారెడ్డి (రాష్ట్ర మంత్రి) - ప్రజాపరిపాలన
శైలజాకిరణ్ (మార్గదర్శి ఎం.డి.) - బిజినెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) - వ్యాపారం, వైద్యం. జగి మంగపాండ (అర్టెల్ కమ్యూనికేషన్స్ ఎం.డి.) - వ్యాపారం, వ్యవస్థాపకత. డాక్టర్ శాంతాసిన్హా - సామాజిక సేవ
బేగం రజియాబేగ్ (ఖదీర్ అలీబేగ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్) - నాటకరంగం
శారద (సినీనటి) - నటన
స్వప్నారెడ్డి (ఓ-2 స్పా వ్యవస్థాపకురాలు) - సామాజిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
డాక్టర్ సోమరాజు సుశీల - శాస్త్రీయ పరిశోధన, వ్యవస్థాపకత. కందుకూరి మహాలక్ష్మి (ప్రముఖ రచయిత్రి) - సాహిత్యం
అవార్డుకు ఎంపికైనవారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్,
సిస్కో సిస్టమ్స్ సీటీవో పద్మశ్రీవారియర్ (సాంకేతికత),
తాజ్ జీవీకే హోటల్స్ రిసార్ట్స్ ఎండీ ఇందిరా కృష్ణారెడ్డి (వ్యాపారం,వ్యవస్థాపకత) కూడా ఉన్నారు.
|
|
No comments:
Post a Comment