ఫిబ్రవరి - 23,2014
ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పరిపాలనా ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా లక్ష్మీస్వామినాథన్ ఎన్నికయ్యారు. ఈ కీలక పదవికి ఎన్నికైన తొలి భారతీయురాలు ఆమే.
» 1991లో ఏర్పాటైన ఏడీబీ పరిపాలనా ట్రైబ్యునల్‌లో లక్ష్మీస్వామినాథన్ కంటే ముందు ఈ పదవిని చేపట్టిన వారిలో ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు ఫిలిప్పీన్స్ దేశస్థులు, శ్రీలంక, బ్రిటన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
» 2010లో లక్ష్మీస్వామినాథన్ ట్రైబ్యునల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2013 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించారు.
» లక్ష్మీ స్వామినాథన్ గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ప్రధాన ధర్మాసనం వైస్ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.
No comments:
Post a Comment