ఫిబ్రవరి - 18,2014
జాతీయ పర్యటక పురస్కారాలను (2012-13) న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో కేంద్ర సహాయ మంత్రి శశిథరూర్ ప్రదానం చేశారు. » రాష్ట్ర పర్యటక శాఖ ఆరు విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. » మధ్యప్రదేశ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ 'ఉత్తమ పర్యటక రాష్ట్రం' పురస్కారాన్ని గెల్చుకుంది. |
» ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతి, అత్యుత్తమ విమానాశ్రయంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, వికలాంగులకు అనువుగా నడకదారి నిర్మించిన గోల్కొండ కోటకు ఉత్తమ కోట పురస్కారం, బెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్, ఫ్రెండ్లీ స్టేట్ విభాగాల్లో మన రాష్ట్రం పురస్కారాలు దక్కించుకుంది. |
» 'అతిథి దేవోభవ' విభాగంలో రాష్ట్ర పర్యటక శాఖ బస్ డ్రైవర్లు మహమ్మద్ సర్దార్, పి.శ్రీనివాసరాజు పురస్కారాన్ని అందుకున్నారు. |
No comments:
Post a Comment