Wednesday, July 23, 2014

భారత అణుశక్తి కార్యక్రమ పితామహుడిగా పేరుగాంచిన హోమీ జె.బాబా నివసించిన బంగ్లా 'మెహ్రంగిర్' ధర ఏకంగా రూ.372 కోట్లు

జూన్ - 18,2014
¤  భారత అణుశక్తి కార్యక్రమ పితామహుడిగా పేరుగాంచిన హోమీ జె.బాబా నివసించిన బంగ్లా 'మెహ్రంగిర్' ధర ఏకంగా రూ.372 కోట్లు పలికింది.   
»    ముంబయిలో అత్యంత విలాసవంతమైన 'మలబార్ హిల్స్' ప్రాంతంలో ఈ భవనం ఉంది. అద్భుత వాస్తు శిల్పంతో నిర్మితమై ఉన్న ఈ మూడంతస్తుల భవంతి సముద్రానికి అభిముఖంగా ఎత్తయిన ప్రదేశంలో ఉంటుంది.   
»    1966లో వియన్నా వెళుతున్న హోమీ బాబా విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన సోదరుడు జెంషేడ్ ఈ ఇంటికి సంరక్షకులయ్యారు.   
»    జెంషేడ్ 'నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)' ను స్థాపించి ఈ భవంతిని సంరక్షించారు. 2007లో జెంషేడ్ మరణించిన తర్వాత ఈ భవంతి ఎన్‌సీపీఏ ఆధీనంలోకి వెళ్లింది.    
»    జంషేడ్ బాబా విల్లు మేరకే ఈ భవంతిని విక్రయించినట్లు ఎన్‌సీపీఏ ఛైర్మన్ ఖుస్రూ సంతూక్ ప్రకటించారు.

No comments:

Post a Comment