మార్చి - 22,2014
విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలను చూపిన సైన్య, నౌకాదళ, వైమానిక అధికారులకు కేంద్రం కీర్తి చక్ర, శౌర్య పతకాలను అందజేసింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలను అందజేశారు. |
» గతేడాది ఉత్తరాఖండ్ వరదల బాధితులను కాపాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైమానిక అధికారి కాస్టెలిన్‌తో పాటు ఏకధాటిగా 151 రోజుల్లో ప్రపంచ యాత్ర చేసిన నౌకాదళాధికారి అభిలాష్ టోమి, ముగ్గురు తీవ్రవాదులను చంపిన ఆర్మీ మేజర్ మహేష్ కుమార్‌ను 'కీర్తి చక్ర' పురస్కారాలతో గౌరవించారు. |
» అసోంలో ఓ ప్రమాదంలో తన సహోద్యోగులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో)కు చెందిన సివిల్ ఇంజినీర్‌తో పాటు పదిమందికి 'శౌర్య' పురస్కారాలను అందజేశారు. వీరిలో ఐదుగురికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. » మరణానంతరం 'శౌర్య' పురస్కారాలు పొందిన వారిలో జమ్మూలోని సాంబాలో అశ్వికదళ యూనిట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ బిక్రం జిత్ సింగ్, బీఆర్వోకు చెందిన ఇంజినీర్ మనీష్, అసోంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన మురళి కన్నన్, ఉత్తరాఖండ్ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన సహపైలట్ కె. ప్రవీణ్, జమ్మూలోని కుప్వారాలో తీవ్రవాదులతో జరిగిన పోరాటంలో మరణించిన రణ్ బహదూర్ గురుంగ్ ఉన్నారు. |
No comments:
Post a Comment