మార్చి - 8,2014
ప్రతిష్ఠాత్మక స్త్రీ శక్తి పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. » అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ స్త్రీ శక్తి పురస్కారాల పేరిట 6 జాతీయ అవార్డులను ప్రదానం చేస్తోంది. » ఈసారి వీటిలో రెండు అవార్డులను తెలుగువారు దక్కించుకున్నారు. |
» హైదరాబాద్‌కు చెందిన రాధా కె ప్రశాంతి కి 'కన్నగి' పురస్కారాన్ని ప్రదానం చేశారు. సామాజికవేత్తగా, నటిగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. 'నాటక కళాపరిషత్' పేరిట పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఆమె 208 ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్నారు. |
» అనాథ పిల్లలు, గిరిజనులు, వికలాంగులు, వితంతువులకు సేవ చేసేందుకు 'స్టెప్' అనే స్వచ్ఛంద సంస్థను ఆమె నడుపుతున్నారు. |
» పురుషులనూ పరిగణనలోకి తీసుకుని ప్రదానం చేసే 'రాణి రుద్రమదేవి' పురస్కారాన్ని ఈసారి ఒంగోలు రిమ్స్‌లో సర్జరీ విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శస్త్రచికిత్స నిపుణులు ఎం.వెంకయ్యకు ప్రదానం చేశారు. |
» గ్రామీణ ప్రాంతాల్లో 30 వేల ప్రసవాలు, 90 వేలకు పైగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, వెయ్యికి పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్సలతో సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వెంకయ్యకు ఈ పురస్కారం దక్కింది. » 'రాణీ లక్ష్మీబాయ్' పురస్కారాన్ని ఒడిశాకు చెందిన మానసి ప్రధాన్‌కు, 'మాతా జిజియాబాయి' పురస్కారాన్ని మహారాష్ట్రకు చెందిన బీనా సేథ్ లష్కరీ కి, 'మాతా దేవి అహల్యాబాయ్ హోల్కర్' పురస్కారాన్ని మహారాష్ట్రకు చెందిన సీమా సఖాడేకు, 'రాణి గైడిన్లూ జెలియాంగ్' పురస్కారాన్ని ఢిల్లీకి చెందిన వర్తికా నందాకు ప్రదానం చేశారు. » అవార్డు గ్రహీతలు ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదును కూడా రాష్ట్రపతి ప్రదానం చేశారు. |
No comments:
Post a Comment