క్షేత్రస్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఛత్తీస్‌గఢ్ పర్యావరణ కార్యకర్త రమేష్ అగర్వాల్ ప్రతిష్ఠాత్మక 'గోల్డ్‌మ్యాన్' పర్యావరణ బహుమతిని గెలుపొందారు.
» ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్న రమేష్ అగర్వాల్ సమాచార హక్కు చట్టం ద్వారా స్థానికుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకొచ్చారు. పర్యావరణ అనుమతులు లేకుండానే బొగ్గుగనుల తవ్వకం కోసం ప్రయత్నించిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రమేష్ ఆ కంపెనీ ప్రాజెక్టును అడ్డుకున్నారు.
» ఈ నేపథ్యంలో ఆయనపై ఒకసారి హత్యాయత్నం జరిగినా, త్రుటిలో తప్పించుకున్నారు.
» ఈ అవార్డు విలువ రూ.1.06 కోట్లు. రమేష్‌తోపాటు ఈ అవార్డుకు మరో ఆరుగురు కూడా ఎంపికయ్యారు. |
|
No comments:
Post a Comment