Friday, July 25, 2014

భారతరత్న విశేషాలు

ఫిబ్రవరి - 4,2014



   »    న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వీరికి అవార్డులను అందజేశారు.
భారతరత్న విశేషాలు
 భారతరత్నను 1954లో ఏర్పాటు చేశారుఇది దేశ అత్యున్నత పౌరపురస్కారం.తరువాతి స్థానాల్లో వరుసగా 

పద్మవిభూషణ్పద్మభూషణ్పద్మశ్రీలు వస్తాయి.కళలుసాహిత్యంశాస్త్రవిజ్ఞానంసామాజిక సేవ తదితర రంగాల్లో 
విశేష సేవలుఅందించిన వారికి  పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
 అవార్డులకు అర్హులుగా భావించిన వారి పేరును ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సుచేస్తారురాష్ట్రపతి ఆమోదం రాగానే,
 వారి పేర్లను ప్రకటిస్తారు
ఒకే సంవత్సరంలోగరిష్ఠంగా ముగ్గురికి  అవార్డును అందించవచ్చుమరణానంతరం కూడాప్రకటించవచ్చు.
 పద్మ పురస్కారాల తరహాలోనే భారతరత్న అవార్డుల కింద కూడా ఎలాంటి నగదుబహుమతిని ఇవ్వరు
ఒక పతకాన్నిరాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రాన్నిఅందజేస్తారు.
¤  ప్రఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు లు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు.
 పతకం రావి ఆకు ఆకృతిలో ఉంటుంది. పొడవు 5.8 సెం.మీ., వెడల్పు 4.7 సెం.మీ., మందం 3.1 మిల్లీమీటర్లు ఉంటుంది. ముందు భాగంలో సూర్యుడి బొమ్మ ఉంటుంది. కిందిభాగంలో 'భారతరత్న' అనే అక్షరాలు దేవనాగరి లిపిలో రాసి ఉంటాయి. వెనుక భాగంలో దేశ అధికార చిహ్నం ఉంటుంది. పతకాలను కోల్‌కతా మింట్‌లో తయారు చేస్తారు. పతకానికి తెల్లటి రిబ్బన్ ఉంటుంది.
భారతరత్న గ్రహీతలకు అందే ప్రయోజనాలు
 దేశంలో ఎక్కడికైనా ఉచితంగా విమానాల్లో మొదటి తరగతి ప్రయాణం.
 ఉచితంగా రైళ్లలో మొదటి తరగతి ప్రయాణం.
 భారత ప్రధానమంత్రికి అందే నెలవారీ వేతనంలో సగానికి సమానమైన మొత్తం పింఛనుగా అందుతుంది.
 పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావచ్చు.
 అవసరమైతే జడ్ కేటగిరీ భద్రత పొందవచ్చు.
 గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారు.
 ప్రాధాన్య క్రమంలో 1. రాష్ట్రపతి 2. ఉపరాష్ట్రపతి 3. ప్రధానమంత్రి 4. రాష్ట్రాల గవర్నర్లు 5. ఉపప్రధాని, మాజీ రాష్ట్రపతులు 6. లోక్‌సభ స్పీకర్, భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత 7వ స్థానంలో భారతరత్న అవార్డు గ్రహీతలు ఉంటారు. ఇదే స్థానంలో మాజీ ప్రధానులు, ప్రస్తుత కేంద్ర కేబినేట్ మంత్రులు, పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు ఉంటారు.గ్రహీతల విశేషాలుఇప్పటివరకు 43 మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
 భారతరత్న తొలుత 1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సి.రాజగోపాలాచారి అందుకున్నారు.
 మరణాంతరం ఈ పురస్కారాన్ని తొలుత పొందినవారు లాల్‌బహుదూర్ శాస్త్రి (1966).
 ఇప్పటివరకు ఇద్దరు విదేశీయులు నెల్సన్ మండేలా (1990), ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987) భారతరత్న అందుకున్నారు.
 మరణానంతరం 1992లో సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ప్రకటించారు. అయితే ఆయన మరణానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో అవార్డును ఉపసంహరించారు. ఈ అవార్డును ఉపసంహరించిన సందర్భం అదొక్కటే.

No comments:

Post a Comment