మే - 19,2014
|
¤ బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జీతన్ రాం మాంఝీ (68) నియమితులయ్యారు. ముఖ్యమంత్రి పదవికి మాంఝీ పేరును మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సూచించారు.
» అత్యంత వెనుకబడిన 'ముసాహర్' కులానికి చెందిన మాంఝీ బాల్యంలో కొన్నేళ్లపాటు వెట్టిచాకిరీ కార్మికుడిగా ఉన్నారు. దాన్నుంచి బయటపడిన అనంతరం విద్యావంతుడై, చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివిధ పార్టీల్లో ఉన్న తర్వాత 1980లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రిగా నియమితులయ్యారు. » 1990లో ఆర్జేడీలో చేరి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ ప్రభుత్వంలో ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2005లో జేడీ (యూ) లో చేరి నితీష్‌కుమార్ వెన్నంటి నడిచిన మాంఝీ ఆయన మంత్రివర్గాల్లో పనిచేశారు. » ముఖ్దంపూర్ ఎమ్మెల్యేగా, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గయ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. |
Wednesday, July 23, 2014
బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జీతన్ రాం మాంఝీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment