ఏప్రిల్ - 27,2014
|
¤ 15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా - IIFA) పురస్కారాలను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న టంపాలో ప్రదానం చేశారు. » ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో 'భాగ్ మిల్కా భాగ్' అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నటుడుగాఫర్హాన్ అక్తర్, ఉత్తమ దర్శకుడిగా ఓం ప్రకాష్ మెహ్రా అవార్డుల్ని స్వీకరించారు. » 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో నటనకు దీపికా పదుకొనే ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. » 'డిడే' చిత్రానికి రిషికపూర్ ఉత్తమ విలన్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. » శతృఘ్న సిన్హాకు జీవితకాల సౌఫల్య పురస్కారం లభించింది. ఆయన సొంతూరైన పాట్నా ప్రజలకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. » 'రాన్ జానా' చిత్రానికి తమిళనటుడు ధనుష్‌కి ఉత్తమ తొలిచిత్ర కథానాయకుడి పురస్కారం దక్కింది. |
Saturday, July 26, 2014
15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా - IIFA) పురస్కారాలు (The 15th International Indian Film Academy (aipha - IIFA) Awards)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment