Thursday, July 24, 2014

రాబర్ట్ ఫాస్టర్ చెర్రీ అవార్డు - 2014'

జనవరి - 18,2014


 ¤    ప్రవాస భారతీయ ప్రొఫెసర్ డా.మీరా చంద్రశేఖర్ అమెరికా అత్యున్నత బోధనా పురస్కారం 'రాబర్ట్ ఫాస్టర్ చెర్రీ అవార్డు - 2014'కు ఎంపికయ్యారని అమెరికాలోని బేలర్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
    »   మిసౌరి యూనివర్సిటీలో భౌతిక, ఖగోళశాస్త్ర అధ్యాపకురాలిగా ఉన్న మీరా చంద్రశేఖర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
    »   ఈ పురస్కారం కింద ఆమెకు రూ.1.5 కోట్లు, ఆమె పనిచేస్తున్న భౌతికశాస్త్ర విభాగానికి రూ.15 లక్షలను ఇవ్వనున్నారు.
    »   ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్న ఆమె మైసూర్‌లోని యం.జి.యం. కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పట్టాలను అందుకున్నారు.
    »   ఆమె 1985లో ప్రతిష్ఠాత్మక 'ఆల్‌ఫ్రెడ్ స్లోన్ ఫెలోషిప్‌'కు, 1992లో అమెరికన్ ఫిజికల్ సొసైటీకి ఎంపికయ్యారు.

No comments:

Post a Comment