మార్చి - 3,2014
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనికుడిగా నిలిచారు. » ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన 2014 వార్షిక బిలియనీర్ల జాబితాలో గేట్స్ మొదటి స్థానాన్ని సంపాదించారు. నాలుగేళ్ల అనంతరం ఆయనకు మళ్లీ ఈ స్థానం దక్కడం విశేషం. |
» గత నాలుగేళ్లు మెక్సికోకు చెందిన టెలికాం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ ప్రథమ స్థానంలో ఉన్నారు. తాజా జాబితాలో ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. » బిల్‌గేట్స్ ఆస్తి నికర విలువ 7,600 కోట్ల డాలర్లకు చేరింది. గత 20 ఏళ్లలో 15 ఏళ్లు గేట్స్ మొదటి స్థానంలో కొనసాగడం విశేషం. |
» జాబితాలో మొత్తం 1,645 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి సగటు నికర విలువ 640 కోట్ల డాలర్లు. » గతంలో ఎప్పుడూ లేని విధంగా జాబితాలో మొత్తం 172 మంది మహిళలు ఉన్నారు. గతేడాది జాబితాలో 130 మంది మహిళా బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. » 2014 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో భారత్‌కు చెందిన 56 మంది సంపన్నులు చోటు దక్కించుకున్నారు. » భారతీయుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 1,860 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. జాబితాలో ముకేష్ 40వ స్థానంలో నిలిచారు. ముకేష్ సోదరుడు అనిల్ అంబానీ 500 కోట్ల డాలర్ల సంపదతో 281వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2008లో ముకేష్ అంబానీ 4,300 కోట్ల డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే 5వ అత్యంత ధనవంతుడిగా నిలవడం గమనార్హం. » ఇతర భారతీయుల్లో అజీమ్ ప్రేమ్‌జీ 61వ స్థానం (1,530 కోట్ల డాలర్లు), దిలీప్ సింఘ్వీ 82వ స్థానం (1,280 కోట్ల డాలర్లు), శివ్‌నాడార్ 102వ స్థానం (1,110 కోట్ల డాలర్లు), హిందుజా సోదరులు 122వ స్థానం (1,000 కోట్ల డాలర్లు), కుమార మంగళం బిర్లా 191వ స్థానం (700 కోట్ల డాలర్లు) సాధించారు. |
No comments:
Post a Comment