Wednesday, July 23, 2014

యునెస్కో వారసత్వ సంపద జాబితాలోకి హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు (జీహెచ్ఎన్‌పీ)

జూన్ - 23,2014
¤  హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు (జీహెచ్ఎన్‌పీ) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చేరింది.   
»     కులు లోయలో సిమ్లాకు 250 కి.మీ. దూరంలో 940.40 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో పురాతన పద్ధతుల్లో పరిసరాలు, అరుదైన జీవులను సంరక్షిస్తున్నారు.  
 »     ఈ ప్రాంతంలోనే ఉన్నత హిమాలయాల మంచు కరిగి నదులు ఏర్పడి ప్రవహిస్తాయి. ఇక్కడ అరుదైన జీవ, జంతుజాలం జీవనం సాగిస్తోంది.  
 »     గుజరాత్‌లోని 11వ శతాబ్దంనాటి రాణీ కా వావ్ దిగుడు మెట్లబావిని కూడా ఈ జాబితాలో చేర్చాలని యునెస్కో ప్రాథమికంగా నిర్ణయించింది.



No comments:

Post a Comment