Friday, July 25, 2014

ఆస్కార్ అవార్డులు 2014

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అమెరికాలోని లాస్ఏంజెలిస్‌లో వైభవంగా నిర్వహించారు.   
»   అమెరికాలో బానిసత్వ పోకడల నాటి కథతో తెరకెక్కిన '12 ఇయర్స్ ఎ స్లేవ్' ఉత్తమ చిత్రం అవార్డును గెలుపొందింది.   
»   ఈ చిత్రానికి సాల్మన్ నార్తప్ అదే పేరుతో రాసిన నవల ఆధారం.   »   ఒక నల్ల జాతీయుడు (బ్రిటిష్ దర్శకుడు స్టీవ్ మెక్ క్వీన్) దర్శకత్వం వహించిన చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం దక్కడం ఆస్కార్ చరిత్రలో ఇదే తొలిసారి.   
»   వ్యోమగాముల అంతరిక్ష యానం నేపథ్యంలో దర్శకుడు అల్ఫాన్సో క్యూరోన్ అద్భుతంగా తెరకెక్కించిన 'గ్రావిటీ' అత్యధికంగా ఏడు పురస్కారాలను గెల్చుకుంది. ఛాయాగ్రహణం, దర్శకత్వం, కూర్పు, ఒరిజినల్ స్కోర్, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.   
»   ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 'ది గ్రేట్ బ్యూటీ' అనే ఇటలీ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది. ఇది ఇటలీ నుంచి ఈ పురస్కారం అందుకున్న 11వ చిత్రం.   
»   పది నామినేషన్లు పొందిన 'అమెరికన్ హజిల్', అందరూ పురస్కారం అందుకుంటుందనుకున్న 'కెప్టెన్ ఫిలిప్స్' ఉత్త చేతులతో వెనుదిరిగాయి.   
»   ఈ వేడుకలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు దివంగత నెల్సన్ మండేలాను గుర్తు చేసుకున్నారు. 'మండేలా : లాంగ్ వాక్‌టు ఫ్రీడమ్' పేరుతో రూపొందిన సినిమాలోని 'ఆర్డినరీ లవ్' అనే పాటను వేదికపై పాడారు.
పురస్కారాల జాబితా
   »   ఉత్తమ చిత్రం :
12 ఇయర్స్ ఎ స్లేవ్
   »   ఉత్తమ నటుడు :మాథ్యూ మెక్ కొనావ్ గె (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)   

»   ఉత్తమ నటి :
కేట్ బ్లాన్‌కెట్ (బ్లూ జాస్మిన్)
   
»   ఉత్తమ సహాయ నటుడు : జార్డ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)   
»   ఉత్తమ సహాయనటి : ల్యుపిటా న్యోస్గ్ ఒ (12 ఇయర్స్ ఎ స్లేవ్)   
»   ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ : ఫ్రోజెన్ (క్రిస్‌బక్, జెన్నిఫర్, పీటర్)   
»   ఉత్తమ ఛాయాగ్రహణం : గ్రావిటీ (ఎమాన్యుల్ లుబెజ్కీ)   
»   ఉత్తమ వస్త్రాలంకరణ : ది గ్రేట్ గాట్స్ బై (కేథరిన్ మార్టిన్)   
»   ఉత్తమ దర్శకుడు : అల్ఫాన్సో క్యూరోన్ (గ్రావిటీ)   
»   ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ : 20 ఫీట్ ఫ్రమ్ స్టార్‌డమ్   
»   ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ : ది లేడీ ఇన్ నంబర్ 6 : మ్యూజిక్ సేవ్డ్ మై లైఫ్ (మాల్కమ్ క్లార్క్, నికొలస్ రీడ్)   
»   ఉత్తమ ఎడిటింగ్ : అల్ఫాన్సో క్యూరోన్ (గ్రావిటీ)   
»   ఉత్తమ విదేశీ భాషా చిత్రం : ది గ్రేట్ బ్యూటీ (ఇటలీ)   
»   ఉత్తమ మేకప్, హెయిర్ స్టయిలింగ్ : డల్లాస్ బయ్యర్స్ క్లబ్ (అద్రుయినాలీ, రాబిన్)   »   ఉత్తమ ఒరిజినల్ స్కోర్ : గ్రావిటీ (స్టీవెన్ ప్రైస్)   
»   ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : లెట్ ఇట్ గో (ఫ్రోజన్)   
»   ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది గ్రేట్ గాట్స్ బై (కేథరిన్ మార్టిన్, బెవర్లీ డన్)   
»   ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : మిస్టర్ హుబ్లట్ (లారంట్ విట్జ్, అలగ్జాండ్రా)   »   ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : హీలియం (యాండర్స్ వాల్టర్, కిమ్)   
»   ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : గ్రావిటీ (గ్లెన్ ఫ్రీ మాంటెల్)
   »   ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : గ్రావిటీ (స్కిప్ లీవ్ సేనివ్అడ్రిక్రిస్టోఫర్ బెన్ స్టేడ్క్రిష్ మున్రో)
   »   ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : గ్రావిటీ (టిమ్ వెబ్బర్క్రిష్ లారెన్స్డేవ్ షిర్క్నీల్ కార్ బోల్డ్)
»   అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : 12 ఇయర్స్  స్లేవ్ (జాన్‌రిడ్లీ)
»   ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: హర్ (స్పైక్ జోన్జ్)


No comments:

Post a Comment