Showing posts with label saumitra chaudhuri committe. Show all posts
Showing posts with label saumitra chaudhuri committe. Show all posts

Wednesday, July 30, 2014

ఇంధన ప్రమాణాల గురించి సౌమిత్ర చౌధురి కమిటి

జూన్ - 13,2014

దేశవ్యాప్తంగా ఇంధన ప్రమాణాలను పెంచాలని నిపుణుల కమిటీ సూచించింది.   
»    ప్రణాళికాసంఘం మాజీ సభ్యుడు సౌమిత్ర చౌధురి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. యూరో-5 ప్రమాణాలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ను ఉత్పత్తి చేయడానికి చమురుశుద్ధి కర్మాగారాలను ఆధునికీకరించాలని ఈ కమిటీ సూచించింది. దీనికి రూ.80 వేల కోట్లు అవసరమని పేర్కొంది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి పెట్రోలు, డీజిల్‌పై 75 పైసల మేర సెస్ విధించాలని తెలిపింది. 2014-15 నుంచి 2021-22 మధ్య ఏడేళ్ల వ్యవధిలో ఈ సెస్ ద్వారా రూ.64వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు.   
»    2017 నాటికి దేశవ్యాప్తంగా దశలవారీగా యూరో-4 ఇంధన ప్రమాణాలను తీసుకురావాలని, 2020 నాటికి యూరో-5 స్థాయిని అందుకోవాలని కమిటీ సూచించింది. 2024 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వస్తాయి.   
»    ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్, లక్నో తదితర 26 నగరాల్లో యూరో-4 (బీఎస్-4) ప్రమాణాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల బీఎస్-3 స్థాయి అమల్లో ఉంది.   
»    చమురుశుద్ధి కర్మాగారాల ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు వీలుగా డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని కమిటీ సూచించింది. పెట్రోల్ ధరలపై నియంత్రణను 2010 జూన్‌లో తొలగించారు.
saumitra chaudhuri