జనవరి - 1,2014
|
¤ దేశ విద్యుత్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. దేశంలోనే తొలిసారిగా ఉత్తరాది గ్రిడ్‌తో, దక్షిణాది గ్రిడ్ అనుసంధానమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తరాది విద్యుత్‌ను సరఫరా చేయడానికి అడ్డంకులు తొలగిపోయాయి. » దేశవ్యాప్తంగా ఉత్తర, తూర్పు, పశ్చిమ గ్రిడ్‌లతో పాటు ఉత్తర - తూర్పు గ్రిడ్‌లు కలిసి ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కలిసి ఒక గ్రిడ్‌గా ఉన్నాయి. » తాజాగా అయిదు గ్రిడ్‌లు కలిసి జాతీయ గ్రిడ్‌గా ఏర్పాటైంది. రాయచూర్ - షోలాపూర్ 765 కేవీ లైన్‌ను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుసంధానం చేసింది. దాదాపు 208 కిలోమీటర్ల పరిధిలోని 765, 400 కేవీ సబ్‌స్టేషన్లను ఒప్పందం పరిధిలోకి తీసుకొచ్చింది. దీని వల్ల దాదాపు రూ.815 కోట్లు వ్యయం అయిందని అంచనా వేశారు. » దేశవ్యాప్తంగా అయిదు గ్రిడ్‌లు అనుసంధానం కావడం వల్ల రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ను డిమాండ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయడానికి వీలవుతుంది. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తరచూ కోతలను ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ ఎక్కువున్న కాలంలో యూనిట్ విద్యుత్‌కు రూ.7 కు పైగా వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నాయి. తాజా అనుసంధానం వల్ల ఇకమీదట విద్యుత్ కొనుగోలు ధర బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. |
Wednesday, July 23, 2014
దేశ విద్యుత్ చరిత్రలో కీలక ఘట్టం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment