మార్చి - 17,2014
|
¤ క్రిమియా తనను తాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. ఇక మీదట ఉక్రెయిన్ చట్టాలు తమకు వర్తించవని స్పష్టం చేసింది. తమను ఒక భాగస్వామ్య దేశంగా చేర్చుకోవాలని కోరుతూ రష్యా సమాఖ్యకు విజ్ఙప్తి చేసింది. స్వయంప్రతిపత్తితో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? రష్యాలో చేరాలా? అనే అంశంపై జరిగిన అభిప్రాయ సేకరణ (రిఫరెండమ్) అనంతరం క్రిమియా ఈ ప్రకటనను జారీ చేసింది. |
» ఇక మీదట స్వతంత్ర సర్వసత్తాక రాజ్యంగా, 'క్రిమియా రిపబ్లిక్' గా ఉంటుందని సుప్రీం కౌన్సిల్ వెల్లడించింది. » ఈ తీర్మానాన్ని 100 సీట్ల క్రిమియా అసెంబ్లీలో హాజరైన 85 మందీ అంగీకరించారని క్రిమియా పేర్కొంది. |
» ఇక నుంచి ఉక్రెయిన్ చట్టాలు వర్తించవని, రష్యా మద్దతిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ గత నెలలో అధికార పీఠాన్ని కోల్పోయిన నాటి నుంచి ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమ వద్ద అమలు కావని స్పష్టం చేసింది. » తమ భూభాగంపై ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు ఇకపై నిలిచిపోతాయని, ఆయా సంస్థల ఆస్తులు, వాటి బడ్జెట్‌లు క్రిమియా ప్రభుత్వానికే చెందుతాయని తెలిపింది. » తమను స్వతంత్ర రాజ్యంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి, ప్రపంచ దేశాలకు విజ్ఞాపన చేసింది |
No comments:
Post a Comment