మార్చి - 6,2014
|
¤ ప్రజల శృంగార జీవితాలను నేరమయం చేయడాన్ని ప్రభుత్వాలు ఆపాలని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరింది. సొంత శరీరాలను నియంత్రించుకునే హక్కును పరిరక్షించాలని వివరించింది.. » శృంగార, పునరుత్పత్తి హక్కులపై ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకంగా 'నా శరీరం.. నా హక్కులు' అనే రెండేళ్ల ప్రచార ఉద్యమాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రారంభించింది. » ప్రజలు తమ శరీరాలు, జీవితాలు, శృంగారం, పునరుత్పత్తి జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే హక్కులను ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు, బంధువులు కాలరాస్తున్నారని సంస్థ విమర్శించింది. » '21వ శతాబ్దంలో కూడా కొన్ని దేశాలు బాల్య వివాహాలను, వైవాహిక అత్యాచారాలను ఆమోదిస్తుండటం గమనార్హం. మరికొన్ని దేశాలు గర్భస్రావం, వివాహేతర శృంగారం, స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే మరణశిక్ష కూడా విధిస్తున్నారు' అని సంస్థ విమర్శించింది. » 'నా శరీరం, నా హక్కులు' ఉద్యమంలో భాగంగా సామాజిక మీడియా ద్వారా యువతను లక్ష్యంగా చేసుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా అల్జీరియా, బుర్కినాఫాసో, బల్ సాల్వెడార్, ఐర్లాండ్, మొరాకో, నేపాల్, ట్యునీషియాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. » అల్జీరియా, ట్యునీషియా, మొరాకోలలో బాధితురాలిని వివాహం చేసుకోవడం ద్వారా రేపిస్టులు శిక్షను తప్పించుకునే వీలుందని సంస్థ తెలిపింది. మొరాకోలో రోజుకు వంద మంది అత్యాచారానికి గురవుతున్నారని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఐర్లాండ్‌లో గర్భస్రావాలను అనుమతించాలంటూ ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. గర్భస్రావానికి నిరాకరించడం వల్ల భారత్‌కు చెందిన సవిత హలప్పన్ అనే వైద్యురాలు మరణించిన సంగతిని సంస్థ గుర్తు చేసింది. » ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రస్తుత సెక్రటరీ జనరల్ సలీల్ షెట్టి. ఆయన భారత్‌కు చెందినవారు. |
Wednesday, July 23, 2014
నా శరీరం, నా హక్కులు'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment