ఫిబ్రవరి - 25,2014
|
¤ కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసి)కి 2014 ఫిబ్రవరి 24 నాటికి 62 ఏళ్లు పూర్తయ్యాయి. వివిధ రంగాల్లోని ఉద్యోగులకు సామాజిక భద్రత చేకూర్చేందుకు ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈఎస్ఐ పథకం కూడా 62 ఏళ్లు పూర్తి చేసుకుంది. |
» 1952 ఫిబ్రవరి 24న అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కాన్పూర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో ఫిబ్రవరి 24ను ఈఎస్ఐ దినోత్సవంగా పాటిస్తున్నారు. » వైద్యసేవలతో పాటు, విధి నిర్వహణలో గాయపడటం, నిరుద్యోగం, మరణం తదితర సందర్భాల్లో బాధితులకు, మృతుల కుటుంబాలకు నగదు ప్రయోజనాలు చేకూర్చడానికి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. |
No comments:
Post a Comment