జనవరి - 26,2014
|
¤ 65వ గణతంత్ర వేడుకలను యావత్ భారతదేశం అత్యంత ఘనంగా జరుపుకొంది. » ఢిల్లీలోని రైసినా హిల్స్ నుంచి ఎర్రకోట వరకు 8 కిలోమీటర్ల దూరం రాజ్‌పథ్ మార్గంలో కొనసాగిన కవాతులు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను అబ్బురపరిచాయి. » జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (ఢిల్లీ), లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతో మిత్ర నేతృత్వంలోని సైనిక, పోలీసు దళాల నుంచి త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. |
» ఈ వేడుకలకు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ప్రధాన అతిథిగా హాజరయ్యారు. జపాన్ ప్రధాని భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇదే ప్రథమం. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. |
» గణతంత్ర దినోత్సవ విశేషాలను బదిరులకు అందించే ఉద్దేశంతో మొదటిసారిగా దూరదర్శన్‌కు చెందిన మూడు ఛానెళ్లు (డీడీ న్యూస్, భారతి, ఉర్దూ) ప్రత్యేకంగా సంకేత భాషలో ప్రసారాలు చేశాయి. |
No comments:
Post a Comment