Wednesday, July 23, 2014

ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్)

jan19,2014

 ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) తన స్థానాన్ని నిలబెట్టుకుంది. లావాదేవీల సంఖ్య పరంగా వరుసగా రెండో ఏడాదీ (2013) అగ్రస్థానంలో నిలిచింది.         
»  ఎన్ఎస్ఈ లో గతేడాది దాదాపు 145 కోట్ల ఈక్విటీ లావాదేవీలు జరిగాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 3% ఎక్కువ. దీంతో ప్రపంచంలోని ఇతర ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లతో పోలిస్తే ఎన్ఎస్ఈ లోనే అత్యధిక లావాదేవీలు జరిగినట్లు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజెస్ (డబ్ల్యూఎఫ్ఈ) ప్రకటించింది.         
»  న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌వైఎస్ఈ)ని చైనాకు చెందిన షెంజెన్ ఎక్స్ఛేంజ్ అధిగమించి రెండో స్థానంలో నిలిచింది. బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) మాత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది.        
 »  టాప్-10లో ఎన్‌వైఎస్ఈ (3), షాంఘై (4), నాస్‌డాక్ (5), కొరియా ఎక్స్ఛేంజ్ (6), జపాన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ - టోక్యో (7), కెనడాకు చెందిన టీఎంఎక్స్ గ్రూప్ (9), లండన్ ఎస్ఈ గ్రూప్ (10) చోటు దక్కించుకున్నాయి.

No comments:

Post a Comment