జీ-8
ఇది ఎనిమిది అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి. ఇందులో కెనడా, ఫ్రాన్‌స, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, యూకే, యూఎస్‌ఏ సభ్య దేశాలు. 1975లో ఆరుదేశాలతో జీ-8 ఏర్పడింది. 1976లో కెనడా ఏడో సభ్యదేశంగా చేరింది. 1997లో రష్యా చేరికతో ఈ గ్రూపు జీ-8గా రూపాంతరం చెందింది. 39వ జీ-8 శిఖరాగ్ర సమావేశం 2013 జూన్ 17, 18 తేదీలలో యునెటైడ్ కింగ్‌డమ్‌లోని నార్తర్‌న ఐర్లాండ్‌లో జరిగింది. యూకే ఈ సమావేశాన్ని నిర్వహించడం ఇది ఆరోసారి. ఈ సమావేశంలో సిరియా అంతర్యుద్ధం గురించి చర్చించారు. 39వ జీ-8 సదస్సుకు కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్, ఫ్రాన్‌స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని ఎన్‌రికో లెట్టా, జపాన్ ప్రధాని షింజో అబె, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూకే ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. జీ-8 తదుపరి సమావేశం జూన్, 2014లో రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది.
జీ-20
20 పెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల కూటమే జీ-20. ఇందులో 19దేశాలు, యూరోపియన్ యూనియన్ సభ్యులు. ఇది 1999లో ఏర్పడింది. ఈ 20 సభ్యుల దేశాధినేతల లేదా ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సమావేశాలు 2008 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వాణిజ్యంలో జీ-20 వాటా 80 శాతం ఉంటుంది. ఇందులో భారతదేశం కూడా ఒక సభ్యదేశమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని పలు సమస్యలను చర్చించడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశం.
జీ-20 సభ్యులు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్‌స, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యూఎస్‌ఏ, ఈయూ.
8వ జీ-20 సదస్సు 2013 సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రష్యాలోని సెయింట్ పీటర్‌సబర్‌గలో జరిగింది. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిరియాపై సైనిక చర్యకు అమెరికా తొందరపడుతున్నప్పటికీ జీ-20లోని పలు దేశాల అధినేతలు మాత్రం దీనిని వ్యతిరేకించారు. తదుపరి జీ-20 సదస్సు నవంబర్, 2014లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతుంది.
బ్రిక్స్
గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేస్తున్న ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఒ నీల్ ‘బ్రిక్’ అనే పదాన్ని 2001లో మొదటిసారిగా వాడారు. జీ-8 తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలను ఆయన అభివర్ణించారు. బ్రిక్ దేశాల మొదటి సదస్సు జూన్, 2009లో రష్యాలోని వకాతెరిన్ బర్‌గ నగరంలో జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో ఈ గ్రూపు బ్రిక్స్‌గా మారింది.
బ్రిక్స్ సదస్సులు: 1) 2009 వకాతెరిన్ బర్‌గ (రష్యా); 2) 2010 బ్రెజీలియా (బ్రెజిల్); 3) 2011 సాన్యా (చైనా); 4) 2012 ఢిల్లీ (ఇండియా); 5) 2013 డర్బన్ (దక్షిణాఫ్రికా)ఐదో బ్రిక్స్ సదస్సు 2013, మార్చి 26, 27 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరిగింది. ఈ సమావేశానికి బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రోసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా హాజరయ్యారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని బ్రిక్స్ సదస్సులకు హాజరైన ఒకే వ్యక్తి మన్మోహన్‌సింగ్. డర్బన్ సదస్సులో బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటుపై చర్చించారు. ఈ బ్యాంక్‌ను 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్యాంకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక వసతులను కల్పిస్తుంది. బ్రిక్స్ తదుపరి సదస్సు 2014లో బ్రెజిల్‌లో జరుగుతుంది.
ఇబ్సా (ఐబీఎస్‌ఏ)
అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఐబీఎస్‌ఏను ఏర్పాటు చేసుకున్నా యి. వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాలలో సహకారానికై ఈ కూటమి ఏర్పడింది. తొలి సమావేశం 2006లో బ్రెజీలియాలో జరిగింది. 5వ సదస్సుకు 2011లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా ఆతిథ్యమిచ్చింది. ఇబ్సా తదుపరి సదస్సు 2013లో న్యూఢిల్లీలో జరుగుతుంది.
సార్క్
దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) డిసెంబర్, 1985లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. సార్క్ సెక్రటరీ జనరల్ మాల్దీవులకు చెందిన అహ్మద్ సలీం. ఇందులో ఎనిమిది సభ్యదేశాలున్నాయి. అవి.. ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్. 2007లో అఫ్ఘానిస్థాన్ ఎనిమిదో సభ్యదేశంగా చేరింది. మొదటి సమావేశం 1985లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. 17వ సమావేశాన్ని నవంబర్, 2011లో మాల్దీవులలోని అద్దూ నగరంలో నిర్వహించారు. ఇందులో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ పాల్గొన్నారు. సార్‌క 18వ సదస్సు 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరుగుతుంది. భారతదేశం ఇప్పటివరకూ మూడు సార్‌క సదస్సులకు ఆతిథ్యమిచ్చింది. 1986లో బెంగళూరులో, 1995లో న్యూఢిల్లీలో, 2007లో న్యూఢిల్లీలో సార్‌క సమావేశాలు జరిగాయి.
అలీనోద్యమం
భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో, ఈజిప్టు రెండో అధ్యక్షుడు గామెల్ అబ్దుల్ నాసర్, ఘనా తొలి అధ్యక్షుడు క్వామేక్రుమా, యుగోస్లేవియా అధ్యక్షుడు జోసెఫ్ టిటో అలీన విధాన రూపకర్తలు. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమిలోని దేశాలు తటస్థ దేశాలు. సభ్యదేశాల స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతలను పరిరక్షించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇందులో 120 సభ్యదేశాలు, 17 పరిశీలక దేశాలు ఉన్నాయి. మొదటి సమావేశం 1961లో బెల్‌గ్రేడ్‌లో జరిగింది. 16వ అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశాన్ని 2012లో ఆగస్టు 26 నుంచి 31 వరకు ఇరాన్ రాజధాని టెహరాన్‌లో నిర్వహించారు. ఇందులో 120 సభ్యదేశాలు పాల్గొన్నాయి. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అలీన దేశాల కూటమికి 2012 నుంచి 2015 వరకు ఇరాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. ప్రస్తుత చైర్మన్ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రుహానీ. ఈ సమావేశాలు మూడేళ్లకు ఒకసారి జరుగుతాయి. 17వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సును 2015లో వెనిజులా రాజధాని కారకాస్‌లో నిర్వహించనున్నారు. మనదేశం ఒకసారి ఆతిథ్యమిచ్చింది. 7వ సమావేశం 1983లో న్యూఢిల్లీలో జరిగింది.
కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్‌స
ఇది ఒకప్పటి బ్రిటిష్ వలస రాజ్యాల కూటమి. ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 ప్రస్తుత అధిపతి. భారతదేశానికి చెందిన కమలేష్ శర్మ సెక్రటరీ జనరల్. ఈ కూటమిలో 2009లో చేరిన చివరిదేశం రువాండా. 1949 లండన్ డిక్లరేషన్ ప్రకారం కామన్‌వెల్త్ ఏర్పడింది. కామన్‌వెల్త్ దేశాల సమావేశాలు రెండేళ్లకు ఒకసారి జరుగుతాయి. వీటిని చోగమ్ అని పిలుస్తారు. ఇఏైఎక అంటే కామన్‌వెల్త్ హెడ్‌స ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. చోగమ్ మొదటి సమావేశం 1971లో సింగపూర్‌లో జరిగింది. 22వ చోగమ్‌ను అక్టోబర్, 2011లో ఆస్ట్రేలియాలోని పెర్‌తలో నిర్వహించారు. 23వ సదస్సు నవంబర్, 2013లో శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతుంది. 7వ కామన్‌వెల్త్ సదస్సుకు 1983లో భారతదేశం ఆతిథ్యమిచ్చింది.
ఒపెక్
ఒపెక్ 1960లో ఏర్పడింది. ఇది పెట్రోలియంను ఎగుమతి చేసే 12 దేశాల కూటమి. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వుంది. సభ్యదేశాలు.. అల్జీరియా, అంగోలా, ఈక్వెడార్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా.
ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య)
ఇండోనేషియా రాజధాని జకర్తా కేంద్ర కార్యాలయంగా ఆసియాన్ 1967లో ఏర్పడింది. ఇందులో పది ఆగ్నేయాసియా దేశాలు సభ్యులు. అవి.. బ్రూనై, ఇండోనేషియా, కాంబోడియా, లావోస్, మలేసియా, మయన్మార్ (బర్మా), ఫిలిప్పైన్‌స, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం. ప్రస్తుత సెక్రటరీ జనరల్ వియత్నాంకు చెందిన లె లుంగ్ మిన్‌హ. 22వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్, 2013లో బ్రూనై రాజధాని బందర్ సెరి బెగవాన్‌లో జరిగింది.
ఎపెక్ (ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్)
ఇది 1989లో సింగపూర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పడింది. ఇందులో 21 దేశాలు సభ్యులు. భారతదేశానికి సభ్యత్వం లేదు. 24వ ఎపెక్ సమావేశం సెప్టెంబర్, 2012లో రష్యాలోని వ్లాదివోస్తాక్‌లో జరిగింది. 25వ సమావేశం వచ్చే నెలలో ఇండోనేషియాలో జరుగుతుంది.
యూరోపియన్ యూనియన్ (ఈయూ)
ఐరోపా ఖండంలోని 28 దేశాల ఆర్థిక, రాజకీయ కూటమే యూరోపియన్ యూనియన్. ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో వుంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెర్మాన్ వాన్ రోంపి. కమిషన్ అధ్యక్షుడు జోస్ మాన్యుయేల్ బరోసో. 2012 నోబెల్ శాంతి బహుమతి ఈయూకే లభించింది. జూలై 1, 2013లో క్రొయేషియా యూరోపియన్ యూనియన్‌లో 28వ సభ్యదేశంగా చేరింది.
నాటో
నాటో 1949లో ఏర్పడిన మిలటరీ కూటమి. ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. సెక్రటరీ జనరల్ ఆండర్‌స ఫాగ్ రాస్‌ముసెన్.
జీ-4
బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్‌లను జీ-4 దేశాలు అంటారు. వీటి ప్రధాన ఉద్దేశం ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం.

No comments:
Post a Comment