మే - 28,2014
ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అయిదుగురు భారతీయులకు చోటు దక్కింది.
»
పెప్సీకో అధిపతి ఇంద్రానూయి 13వ స్థానంలో, ఎస్‌బీఐ ఛైరపర్సన్ అరుంధతీ
భట్టాచార్య 36వ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్ 43వ స్థానంలో,
సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో,
బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో నిలిచారు.
» జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ జాబితాలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. మొత్తం మీద 11 సార్లు ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేయగా 10 సార్లు అందులో ఆమె చోటు దక్కించుకున్నారు. అందులో 9 సార్లు తొలిస్థానంలోనే ఉండటం విశేషం.
» ఏంజెలా మెర్కెల్ తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్ పర్సన్ జానెట్ యెలెన్ (2వ స్థానం), దాతృశీలి మిలిండా గేట్స్ (3), అమెరికా మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బర్రా (7), అమెరికా తొలి పౌరురాలు మిషెల్లీ ఒబామా (8), ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్ బర్గ్ (8)లు తొలి 10 స్థానాల్లో ఉన్నారు.
ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అయిదుగురు భారతీయులకు చోటు దక్కింది.
» జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ జాబితాలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. మొత్తం మీద 11 సార్లు ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేయగా 10 సార్లు అందులో ఆమె చోటు దక్కించుకున్నారు. అందులో 9 సార్లు తొలిస్థానంలోనే ఉండటం విశేషం.
» ఏంజెలా మెర్కెల్ తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్ పర్సన్ జానెట్ యెలెన్ (2వ స్థానం), దాతృశీలి మిలిండా గేట్స్ (3), అమెరికా మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బర్రా (7), అమెరికా తొలి పౌరురాలు మిషెల్లీ ఒబామా (8), ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్ బర్గ్ (8)లు తొలి 10 స్థానాల్లో ఉన్నారు.
No comments:
Post a Comment