Monday, August 4, 2014

ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు పంపే నగదు గురించి రిజర్వు బ్యాంకు నివేదిక పూర్తి సమాచారం

జనవరి - 3,2014

ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు పంపే నగదును ప్రధాన నగరాల్లో కుటుంబాలు రోజువారీ అవసరాలకు వినియోగించడం తగ్గిందనీ, ప్రతిఫలం వచ్చే పెట్టుబడుల్లోకి ఈ సొమ్మును మళ్లించడం పెరిగిందనీ రిజర్వ్‌బ్యాంక్ నివేదిక వెల్లడించింది.

ముఖ్యాంశాలు
 గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ప్రైవేటు వ్యక్తులు పంపిన మొత్తం 6,76,270 డాలర్లు. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి 2,49,340 డాలర్లు, ఉత్తర అమెరికా నుంచి 2,32,200 డాలర్లు వస్తున్నాయి. ఐరోపా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల నుంచి మిగిలిన మొత్తాలు వస్తున్నాయి.

 రాష్ట్రానికి చేరుతున్న నగదులో 83% డాలర్ల రూపంలో, 9% యూరో రూపేణా, 3% బ్రిటన్ పౌండ్ల కింద వస్తున్నాయి. ఇతర దేశాల కరెన్సీ 4% వస్తోంది. ఈ విషయంలో ఒడిశా మాత్రమే 94% డాలర్లు అందుకుంటూ, మన రాష్ట్రంకంటే ముందుంది. దేశీయ సగటు 57 శాతమే.

 రాష్ట్రానికి అమెరికా నుంచి 64%, ఐరోపా నుంచి 11%, గల్ఫ్ నుంచి 10%, దక్షిణ అమెరికా నుంచి 8%, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి 3% , ఆఫ్రికా నుంచి 2% తూర్పుఆసియా నుంచి 2% చొప్పున ఈ సొమ్ము వస్తోంది.




No comments:

Post a Comment