Monday, August 4, 2014

ప్రపంచంలోని అత్యంత విలువైన వంద బ్రాండ్‌లతో ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన జాబితా

నవంబరు - 26,2013
ప్రపంచంలోని అత్యంత విలువైన వంద బ్రాండ్‌లతో ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన జాబితాలో అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్ తొలి స్థానంలో నిలిచింది. 
    
»  'వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ లిస్ట్' లో యాపిల్ తర్వాతి స్థానాలను మైక్రోసాఫ్ట్, కోకాకోలా, ఐబీఎం, గూగుల్ దక్కించుకున్నాయి.    
»  మొదటి స్థానంలో ఉన్న టెక్నాలజీ కంపెనీ యాపిల్ బ్రాండ్ విలువ 104.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,36,230 కోట్లు) ఉంది. తర్వాతి స్థానంలో ఉన్న మరో టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ బ్రాండ్ విలువ 56.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే యాపిల్ విలువ దాదాపు రెట్టింపుఉంది.    
»  క్రితం ఏడాదితో పోలిస్తే యాపిల్ బ్రాండ్ విలువ 20% పెరిగింది. మైక్రోసాఫ్ట్ బ్రాండ్ విలువ 4 శాతమే పెరిగింది. 54.9 బిలియన్ డాలర్ల విలువతో కోకాకోలా బ్రాండ్ మూడో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ బ్రాండ్ విలువ 9% పెరిగింది.    
»  మొత్తం వంద బ్రాండ్‌లలో సగానికి పైగా బ్రాండ్‌లు అమెరికాకు చెందినవే. తొమ్మిది బ్రాండ్‌లు జర్మనీకి చెందినవి. ఫ్రాన్స్ బ్రాండ్‌లు ఎనిమిది. జపాన్ బ్రాండ్‌లు ఏడు.    
»  భారత్‌కు చెందిన ఒక్క బ్రాండ్ కూడా ఈ జాబితాలో లేదు.    
»  జాబితాలో టెక్నాలజీ బ్రాండ్‌ల హవా నడిచింది. జాబితాలో మొత్తం 19 టెక్నాలజీ బ్రాండ్‌లు ఉన్నాయి. మొదటి 10 బ్రాండ్‌లలో 6 ఈ విభాగానికి చెందినవే.    
»  గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా శామ్‌సంగ్ విలువ 53% పెరిగింది. 29.5 బిలియన్ డాలర్లతో శామ్‌సంగ్ తొమ్మిదో స్థానంలో ఉంది. గత మూడేళ్లలో ఈ బ్రాండ్ విలువ 136% పెరిగింది.    
»  గత ఏడాది 6.1 బిలియన్ డాలర్లు ఉన్న బ్లాక్‌బెర్రీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 2.2 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ఈ కంపెనీకి జాబితాలో స్థానం లేకుండాపోయింది.    
»  మూడేళ్ల క్రితం నోకియా బ్రాండ్ 27.3 బిలియన్ డాలర్ల విలువతో తొమ్మిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు 7 బిలియన్ డాలర్లతో 71 వ స్థానానికి పడిపోయింది.    
»  మూడేళ్ల ఆదాయాలు, ఆయా పరిశ్రమలో ఆ బ్రాండ్ పోషించిన పాత్ర, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 'ఫోర్బ్స్' జాబితాను తయారుచేసింది. జాబితాలో 15 దేశాలు, 20 పరిశ్రమలకు చెందిన కంపెనీలున్నాయి.
                 అత్యంత విలువైన మొదటి 10 బ్రాండ్‌లు

No comments:

Post a Comment