Monday, August 4, 2014

ఉద్యోగం చేయడానికి అత్యుత్తమమైన కంపెనీగా గూగుల్ అగ్రస్థానంలో నిలవడానికి కారణాలు ఏవి ? తెలుసుకుందామా?

జనవరి - 29,2014
ఉద్యోగం చేయడానికి అత్యుత్తమమైన కంపెనీగా గూగుల్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎస్ఏఎస్, తర్వాతి స్థానంలో ప్రముఖ సలహా సేవల సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నిలిచాయి. 

¤       పని చేయడానికి అనువైన 100 కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ పత్రిక రూపొందించింది. ఈ జాబితాలో గూగుల్ అగ్రస్థానం దక్కించుకుంది. గూగుల్ ఇలా పైచేయి సాధించడం వరుసగా ఇది అయిదో ఏడాది. జాబితాలో చోటు సంపాదించడం ఇప్పటికిది ఎనిమిదోసారి. 'గత ఏడాది గూగుల్ షేర్ ధర 1,000 డాలర్లు దాటింది. ఇది సిబ్బందికి ఒక వరం లాంటిదే. ఎందుకంటే, ఆ సంస్థలోని ఉద్యోగులంతా కంపెనీలో వాటాదార్లే (షేర్ హోల్డర్లే)' అని ఫార్చ్యూన్ పేర్కొంది. తన వద్ద పనిచేసే ఉద్యోగులకు గూగుల్ అందిస్తున్న అదనపు ప్రయోజనాలు ఆ కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేలా చేశాయని పత్రిక వివరించింది.


¤       క్వాల్‌కామ్‌కు 32వ స్థానం లభించింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ 45, సిస్కో 55, హయాత్ హోటల్స్ 95 స్థానాల్లో నిలిచాయి. జాబితాను రూపొందించడానికి 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ఫార్చ్యూన్ ఆయా కంపెనీల్లో పని చేస్తున్న 2,52,000 మందికి పైగా ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి వడపోసింది.


¤       దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా శామ్‌సంగ్ నిలిచింది. తర్వాత స్థానాలను సోనీ, టాటాలు సొంతం చేసుకున్నాయని 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2014' నివేదిక తెలిపింది. గత ఏడాది ఈ మూడూ వరుసగా రెండు, మూడు, అయిదో స్థానాల్లో ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాదీ ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఎ) ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఇందులో 100 కంపెనీలకు ర్యాంకులు ఇస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన మరో కంపెనీ ఎల్‌జీ నాలుగో స్థానంలో, నోకియా అయిదో స్థానంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. హ్యూలెట్ ప్యాకార్డ్ 14 స్థానాలు ఎగబాకి, ఆరో స్థానాన్ని ఆక్రమించింది. హీరో 79 స్థానాలు దాటి, ఏడో స్థానానికి చేరింది. మొదటి పది స్థానాల్లో ఉన్న కంపెనీల్లో హోండా, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

No comments:

Post a Comment