Monday, August 4, 2014

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ తొలిసారిగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలతో పాటు మరో 17 దేశాల్లోని యూనివర్సిటీల ర్యాంకుల జాబితా

 డిసెంబరు - 5,2013


¤   టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ తొలిసారిగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలతో పాటు మరో 17 దేశాల్లోని యూనివర్సిటీల ర్యాంకుల జాబితాను రూపొందించింది.
         
»   వీటిల్లో చైనా విశ్వవిద్యాలయాలు పెకింగ్, త్సింగ్వాలు 1, 2 ర్యాంకుల్లో నిలిచాయి. చైనా విశ్వవిద్యాలయాలు జాబితాలో అత్యధిక స్థానాలను దక్కించుకున్నాయి.
        
»   భారత్‌కు సంబంధించి ప్రధాని మన్మోహన్‌సింగ్ చదివిన పంజాబ్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. దీనికీ, చైనాలోని రెన్‌మిన్ యూనివర్సిటీకి సంయుక్తంగా 13వ ర్యాంక్ లభించింది.
        

»    పంజాబ్ యూనివర్సిటీ తర్వాత స్థానాల్లో ఐఐటీలు నిలిచాయి. ఖరగ్‌పూర్ (30), కాన్పూర్ (34), ఢిల్లీ, రూర్కీ సంయుక్తంగా (37), గౌహతి (46), మద్రాస్ (47) ఐఐటీలకు ర్యాంకులు దక్కాయి. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం కూడా మద్రాస్ ఐఐటీతో సమాన ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
        

»   అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి 50వ స్థానం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి 57వ ర్యాంక్ దక్కాయి.

No comments:

Post a Comment