మార్చి - 3,4,2014
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్ (BIMSTEC బిమ్స్‌టెక్) శిఖరాగ్ర సదస్సును మయన్మార్‌లోని నెపైతాలో నిర్వహించారు. |
» ఇది మూడో బిమ్స్‌టెక్ సదస్సు. » బిమ్స్‌టెక్‌లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్, నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి. » బిమ్స్‌టెక్ సదస్సుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌హసీనా, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, మయన్మార్ అధ్యక్షుడు థీన్ సీన్, నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే, థాయ్‌లాండ్ విదేశీ వ్యవహారాల శాశ్వత కార్యదర్శి సిహాసక్ ఫువాంగ్‌కెట్‌కోవ్ హాజరయ్యారు. నేపిటాలో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్, మయన్మార్ భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన నేతల సమావేశం అనంతరం మూడో 'బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్ - బిమ్స్‌టెక్' సదస్సు డిక్లరేషన్‌ను విడుదల చేశారు. » ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాపై ఉమ్మడిగా పోరాడాలని ఏడు దేశాల 'బిమ్స్‌టెక్' కూటమి నేతలు ప్రతిన బూనారు. వాణిజ్యం, విద్యుత్, పర్యావరణ రంగాల్లో సహకారం అందజేసుకోవాలని, దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచుకునేందుకు తీవ్రస్థాయిలో కృషి చేయాలని అంగీకారానికి వచ్చారు. » సదస్సులో మూడు ఒప్పందాలపై అంగీకారానికి వచ్చారు. ఢాకాలో నెలకొల్పనున్న బిమ్స్‌టెక్ శాశ్వత సచివాలయం కోసం మెమొరాండం ఆఫ్ అసోసియేషన్‌కు అంగీకారం తెలిపారు. భారత్‌లో 'బిమ్స్‌టెక్ సెంటర్ ఫర్ వెదర్ అండ్ క్త్లెమేట్' ఏర్పాటు చేయడంపై మరో ఒప్పందం కుదిరింది. బిమ్స్‌టెక్ కల్చరల్ ఇండస్ట్రీస్ కమిషన్, బిమ్స్‌టెక్ కల్చరల్ ఇండస్ట్రీస్ అబ్జర్వేటరీ ఏర్పాటు కోసం మరో అవగాహన ఒప్పందం కుదిరింది. » బిమ్స్‌టెక్ తొలి సెక్రెటరీ జనరల్‌గా శ్రీలంకకు చెందిన సుమిత్ నకందల ను నియమించారు. అధ్యక్ష బాధ్యతలను మయన్మార్ నుంచి నేపాల్ స్వీకరించింది. |
No comments:
Post a Comment