Monday, August 4, 2014

అమెరికా తన నిఘా కార్యక్రమాల ద్వారా ప్రపంచానికే ప్రమాదకర ఉదాహరణగా మారిందా? అయితే తెలుసుకుందాం.

జనవరి - 21,2014

90 దేశాల్లో మానవ హక్కుల పరిస్థితిపై హ్యూమన్ రైట్స్ వాచ్ 667 పేజీల నివేదికను వెలువరించింది.
      

»   అమెరికా తన నిఘా కార్యక్రమాల ద్వారా ప్రపంచానికే ప్రమాదకర ఉదాహరణగా మారిందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గోప్యత హక్కును గౌరవించని అమెరికా జాతీయ భద్రత సంస్థ ధోరణి దమన నీతిని అనుసరించే దేశాలకు కూడా అవకాశంగా మారిందని పేర్కొంది. అవన్నీ దేశీయంగా ఉత్పత్తయ్యే సమాచారాన్ని సరిహద్దులు దాటకుండా చూసుకోవడం ద్వారా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపుతున్నాయని తెలిపింది.
      

»   ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో ఎక్కువ శాతం అమెరికా మీదుగా పోవడమో, అమెరికా కంపెనీ సర్వర్ల నుంచి పోవడమో జరుగుతున్నందువల్ల ఇంటర్నెట్ సమాచారంపై నిఘా వేయడంలో అమెరికా అగ్రస్థానంలో ఉందని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.
      

»   ఇంటర్నెట్ స్వేచ్ఛకు ప్రతీకగా మారిన అమెరికాయే ఇప్పుడు ఇంటర్నెట్ నిఘాకు మారుపేరుగా మారిందని నివేదిక తెలిపింది. చైనా, రష్యాలతో పాటు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కూడా అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

No comments:

Post a Comment