Saturday, August 2, 2014

చోగమ్ సదస్సు 2013 గురించి పూర్తీ వివరాలు (chogm conference 2013 full details )

నవంబరు - 15,17,2014


కొలంబోలోని నీలం పొకునా (కలువల కొలను) రాజపక్సే థియేటర్‌లో మూడు రోజుల పాటు సాగే చోగమ్ సదస్సు ప్రారంభమైంది.
        

»  ఈ ఏడాది 'సమానత్వంతో కూడిన అభ్యున్నతి, సమ్మిళత వృద్ధి' అనే అంశంపై చోగమ్ సదస్సు చర్చించనుంది.

        
»  శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, బ్రిటన్ యువరాజు ఛార్లెస్, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ కమలేష్ శర్మ, కామన్వెల్త్ అధ్యక్షుడు, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబాట్, భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితర 53 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
        

»  సదస్సును బహిష్కరించాలంటూ తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీల డిమాండ్ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ కామన్వెల్త్, సమావేశాలకు గైర్హాజరయ్యారు. అలాగే శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగులాం కూడా సదస్సుకు హాజరుకాలేదు.
        

»  బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో పర్యటించి, చరిత్ర సృష్టించారు. శ్రీలంక స్వాతంత్య్రం పొందిన 1948 తర్వాత ఒకప్పటి ఎల్‌టీటీఈ ప్రాబల్య ప్రాంతమైన జాఫ్నాలో ఓ దేశ ప్రభుత్వాధిపతి పర్యటించడం ఇదే తొలిసారి.

»  మానవ హక్కులను బలోపేతం చేయడానికి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, సమగ్రమైన విధానాన్ని అవలంబించడానికి చర్యలను ముమ్మరం చేయాలని చోగమ్ సదస్సు నిర్ణయించింది. 'అభివృద్ధి హక్కు సహా సమానత్వం, పౌరుల గౌరవ భద్రత, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులను అందరికీ అందించాలనే విషయాన్ని కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు పునరుద్ఘాటించారు' అని 21 పేజీలతో విడుదల చేసిన కామన్వెల్త్ ప్రకటన పేర్కొంది. శ్రీలంక పేరు ప్రస్తావించకుండా ఎల్‌టీటీఈ పై దాడుల సందర్భంగా పాల్పడిన యుద్ధ నేరాలను విమర్శించింది. జాతీయ మానవ హక్కుల సంస్థల ఏర్పాటు, వాటిని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సభ్యదేశాలను కోరింది. 'అన్ని రకాల మానవ హక్కులతో అభివృద్ధి హక్కు అవిభాజ్యమైంది' అని పేర్కొంది. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నట్లు కామన్వెల్త్ ప్రకటన వివరించింది.
       
»   శ్రీలంకలోని జాఫ్నాలో ఎల్‌టీటీఈ పై సైనిక దాడుల సందర్భంగా జరిగిన యుద్ధ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తునకు అంగీకరించేది లేదని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే స్పష్టం చేశారు.
శ్రీలంకను కామన్వెల్త్ దేశాలు శాసించలేవని అన్నారు.
శ్రీలంకలోని తమిళుల మధ్య సయోధ్యను కుదర్చడానికి కొంత సమయం కావాలని, అయితే దానికి కాలవ్యవధి లేదన్నారు.
      
»   2015లో జరిగే తదుపరి చోగమ్ సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు దక్షిణ ఐరోపా దేశమైన మాల్తా ఏకగ్రీవంగా ఎంపికయింది.
      

»   కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శి కమలేష్ శర్మ. ఆయన భారతీయుడు.

No comments:

Post a Comment