దేశ ప్రథమ ఓటరు శ్యాంశరణ్ నేగి (97)
తనలోని ఓటు స్ఫూర్తిని చాటుతూ ఎనిమిదో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి
అందరినీ ఆకర్షించారు. ఆయన భార్య హీరామణి (92) కూడా ఓటు వేశారు.
» వీరిద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా కల్పాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కిన్నౌర్ శాసన సభ స్థానం మండీ లోక్‌సభ పరిధిలో ఉంది.
» 1951 అక్టోబరు 25 నుంచి 1952 ఫిబ్రవరి వరకు దశలవారీగా జరిగిన దేశ తొలి సాధారణ ఎన్నికల్లో ఆయన తొలి ఓటు వేశారు. అప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్న నేగి వయసు 34 ఏళ్లు. ఆనాడు తొలి పోలింగ్ కేంద్రాన్ని కల్పాలో ఏర్పాటు చేశారు. అక్కడే ఎన్నికల విధుల్లో ఉన్న నేగి అక్టోబరు 25, 1951న తొలుత తానే ఓటేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆయనను భారత తొలి ఓటరుగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఆయన తప్పకుండా ఓటు వేస్తూనే ఉన్నారు.
» లోక్‌సభ ఎన్నికల్లో నేగి 17వ సారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
» ఈసారి గిరిజన ప్రాంతాల్లో ఓటు హక్కుకు సంబంధించిన ప్రచారకర్తగా శ్యాంశరణ్ నేగిని ఎన్నికల సంఘం ఎంపిక చేయడం విశేషం.

No comments:
Post a Comment