జనవరి - 9,2014
అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలనేది రిజర్వ్‌బ్యాంక్ లక్ష్యం. ఇందుకు తగిన సూచనలిచ్చేందుకు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్వనిర్వాహక సంచాలకుడి(ఈడీ)గా పనిచేసిన నచికేత్ మోర్ నేతృత్వంలో గతంలో ఒక బృందాన్ని నియమించారు. నాలుగు నెలలు తిరగకముందే ఈ బృందం తన నివేదికను సమర్పించింది. ఇందులో కొన్ని కీలకమైన సిఫార్సులు కిందివిధంగా ఉన్నాయి.
» 2016 జనవరి ఒకటో తేదీకల్లా 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పూర్తిస్థాయిలో సేవలు లభించే ఎలక్ట్రానిక్ బ్యాంక్ ఖాతా ఉండేలా చూడాలి.
» తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల అవసరాలను తీర్చే విధంగా ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేయాలి.
» దేశంలో ఎక్కడైనా సరే, ఓ పావుగంట నడిస్తే చాలు నగదు జమచేసే, తీసుకునే సదుపాయం అందుబాటులో ఉండాలి.
» ఆటోమేటిక్‌గా బ్యాంక్ ఖాతాను తెరవడానికి ఆధార్ కార్డును ఉపయోగించుకోనివ్వాలి.
» మౌలిక సదుపాయాలకు నిధులందించేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఉండాలి.

No comments:
Post a Comment