నవంబరు - 13,2013
'భారత్‌లో ఉన్నత విద్య: విజన్ 2030' అనే అంశంపై ఫిక్కీ రూపొందించిన నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి శశిథరూర్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. |
ముఖ్యాంశాలు |
» ప్రతిభావంతులైన విద్యార్థులను అందించడంలో 2030 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. » ప్రపంచంలో ప్రతి నలుగురు పట్టభద్రుల్లో ఒకరు భారత్‌లోని ఉన్నత విద్యావ్యవస్థ అందించిన వారే అయి ఉంటారు. » పరిశోధన ఫలితాల్లోనూ తొలి అయిదు దేశాల్లో భారత్ ఉంటుంది. » ప్రపంచంలోని 200 అగ్ర విశ్వవిద్యాలయాల్లో భారత విశ్వవిద్యాలయాలు 20 ఉంటాయి. » 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా మానవ వనరులను సిద్ధం చేయడానికి వీలుగా ఉన్నతవిద్య, వృత్తి విద్యకు నిధులిచ్చేందుకు పారిశ్రామిక రంగం ముందుకు రావాలని శశిథరూర్ పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అనుగుణమైన విద్య, నైపుణ్య ఆధారిత కోర్సులను పరిచయం చేయాలని ఆయన సూచించారు. |
No comments:
Post a Comment