డిసెంబరు - 15,2013
ఇటాలియన్ పురావస్తు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు 2,400 ఏళ్ల నాటి మట్టి బొమ్మను పుగ్లియాలోని టరంటోకు సమీపంలో బయటపడిన సమాధిలో కనుక్కున్నారు.
» పంది పిల్ల ఆకారంలో ఉన్న ఈ బొమ్మ పిల్లలకు పాలు పట్టించే సీసాకి రెట్టింపు పరిమాణంలో ఉంది. దీనికి చెవులు, కళ్లు ఉన్నాయి. బొమ్మ మధ్య భాగంలో చిన్నారులు పట్టుకోవడానికి అనుకూలంగా హ్యాండిల్ ఉంది.
» సమాధిలో ఈ బొమ్మతో పాటు మరికొన్ని అరుదైన వస్తువులు బయటపడ్డాయి. వీటిలో జగ్గులు, పళ్లేలు, దీపపు ప్రమిదలు, పిల్లలకు పాలు పట్టే సీసాలు మొదలైనవి ఉన్నాయి. నలుపు రంగు వేసిన పాత్ర, కత్తి, ఇనుప బ్లేడు కూడా లభించాయి.

No comments:
Post a Comment