Monday, August 4, 2014

దేశంలోని అతిపెద్ద 500 కంపెనీలతో ఫార్చ్యూన్ ఇండియా పత్రిక రూపొందించిన జాబితా

డిసెంబరు - 10,2013
దేశంలోని అతిపెద్ద 500 కంపెనీలతో ఫార్చ్యూన్ ఇండియా పత్రిక రూపొందించిన జాబితాలో వార్షికాదాయ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) నిలిచింది. ఈ సంస్థ వార్షికాదాయం రూ.4,75,867 కోట్లు.
          
»   ఈ జాబితాలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రెండో స్థానంలో నిలిచింది. ఈ సంస్థ వార్షికాదాయం రూ.4,09,883 కోట్లు.
          

»   మూడో స్థానంలో భారత్ పెట్రోలియం (రూ.2,44,822 కోట్లు), నాలుగో స్థానంలో హిందూస్థాన్ పెట్రోలియం (రూ.2,17,771 కోట్లు) నిలిచాయి.
          

»   జాబితాలో అయిదు నుంచి 10 వరకు స్థానాల్లో నిలిచిన కంపెనీలు: ఎస్‌బీఐ, టాటామోటార్స్, ఓఎన్‌జీసీ, టాటాస్టీల్, ఎస్సార్ ఆయిల్, కోల్ ఇండియా.
          

»   ఇతర ప్రధాన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్ (12వ ర్యాంక్), ఐసీఐసీఐ బ్యాంక్ (14), ఎన్‌టీపీసీ (15), టీసీఎస్ (18), ఇన్ఫోసిస్ (27)లు జాబితాలో నిలిచాయి.
          

»   మొదటి పది కంపెనీల్లో ఏడు ఇంధన రంగ కంపెనీలే ఉన్నాయి. ఈ పది కంపెనీల్లో ఆరు ప్రభుత్వ రంగ, నాలుగు ప్రైవేటు రంగ కంపెనీలు.
          

»   మొదటి ఎనిమిది కంపెనీలు గత ఏడాది స్థానాల్లోనే కొనసాగడం విశేషం.

No comments:

Post a Comment