Thursday, July 31, 2014

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జంతువు/ జీవులతో కూడిన ఇన్ఫో గ్రాఫిక్‌

ఏప్రిల్ - 29,2014

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జంతువు/ జీవులతో కూడిన ఇన్ఫో గ్రాఫిక్‌ను రూపొందించారు. వీటి ద్వారా ఏటా ఎంత మంది మానవులు చనిపోతున్నారనే వివరాలను కూడా తెలియజేశారు.   
»     దోమ ద్వారా వచ్చే మలేరియా తదితర వ్యాధుల వల్ల ప్రపంచంలో ఏటా 7.25 లక్షల మంది చనిపోతున్నారు. 20 కోట్ల మంది జ్వరాలు, జబ్బుల బారిన పడుతూ, మంచానికి అతుక్కుపోతున్నారు. అందుకే బిల్‌గేట్స్ ఈ జాబితాలో దోమను తొలిస్థానంలో చేర్చారు.    
»     దోమ తర్వాత ప్రమాదకర జీవి స్థానం మనిషిదే. ఒకరినొకరు చంపుకోవడం, యుద్ధాలు వంటి వాటివల్ల ఏటా 4.75 లక్షల మంది మరణిస్తున్నారు.  
 »     మూడో స్థానంలో పాము (50 వేల మంది మృతులు), నాలుగో స్థానంలో కుక్క (రేబిస్ వ్యాధి వల్ల 25 వేల మంది మరణిస్తున్నారు) ఉన్నాయి.   
»     తర్వాతి స్థానాల్లో ఒక రకమైన ఈగ, అసాసిస్ బగ్, నత్తలు ఉన్నాయి.ఇవి ఒక్కోరకం పది వేల మందిని బలితీసుకుంటున్నాయి.  
 »     ఈ జాబితాలోని చివరి మూడు స్థానాల్లో సింహం (100 మంది), తోడేలు (10 మంది), షార్క్ (10 మంది మృతులు) ఉన్నాయి.
 

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు మహిళ

ఏప్రిల్ - 21,2014

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.రోహిణి బాధ్యతలు స్వీకరించారు.     
»     ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సమక్షంలో జస్టిస్ రోహిణి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.    
»     ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రోహిణిని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవలే నియమించారు.    
»     రాష్ట్రానికి చెందిన జస్టిస్ రోహిణికి ముందు ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ కూడా రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. జస్టిస్ రమణ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లారు.   
»     జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2001లో అదనపు జడ్జిగా, 2002లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు.
 

అమెరికాలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష 'సాట్ (స్కాలిస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్)'లో వంద శాతం మార్కులు సాధించి సంచలనం సృష్టించిన భారతీయుడు

ఏప్రిల్ - 20,2014

కోల్‌కతాకు చెందిన అరునాహ్వా చందా అమెరికాలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష 'సాట్ (స్కాలిస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్)'లో వంద శాతం మార్కులు సాధించి సంచలనం సృష్టించాడు.    
»     'సాట్‌'లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ విభాగాల్లో ఒక్కో దాంట్లోంచి 800 మార్కులకు ప్రశ్నలుంటాయి. గరిష్ఠ మార్కులు 2,400.   
»     హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, కొలంబియా, డ్యూక్, కార్నెల్, జార్జియా, డార్ట్‌మౌత్, ఎంఐటీ అనే 8 యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం చందా దరఖాస్తు చేసుకున్నాడు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు చూసి ఒక్క ఎంఐటీ మినహా మిగతా యూనివర్సిటీలన్నీ అతనికి ఉపకార వేతనంతో కూడిన సీటును ఆఫర్ చేశాయి. తన 12వ స్టాండర్డ్ పరీక్షల కారణంగా ఎంఐటీ కోరిన ఓ ప్రాజెక్టును సకాలంలో అందజేయకపోవడంతో ఎంఐటీ చందా దరఖాస్తును తిరస్కరించింది.    
»     ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే 7 యూనివర్సిటీలు స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయం అందించి మరీ చేర్చుకుంటామంటూ స్వాగతం పలుకుతుండటంతో చందా వార్తల్లో నిలిచాడు.
arunavha chanda

 

ఇంటర్‌నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తాజాగా ప్రకటించిన 'మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ'ల్లో తెలుగువాడికి ప్రథమస్థానం

ఏప్రిల్ - 17,2014

ఇంటర్‌నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తాజాగా ప్రకటించిన 'మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీ'ల్లో టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో నిలిచారు.    
»     ఇటీవల బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్‌కళ్యాణ్ ప్రత్యేకంగా అహ్మదాబాద్‌లో సమావేశమైన నేపథ్యంలో ఆయనకు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా గుర్తింపు లభించింది.  
 »     'మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రీటీ'ల్లో పవన్ కళ్యాణ్ తరువాతి స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ, నటి రమ్య (దివ్య స్పందన), రచయిత, నటుడు కుమార్ బిశ్వాస్ (ఆప్) ఉన్నారు. ఒకనాటి బాలీవుడ్ అందాల తార నగ్మా (మీరట్ కాంగ్రెస్ అభ్యర్థి), డ్రీమ్‌గర్ల్ హేమమాలిని (మధుర బీజీపీ అభ్యర్థి) తరువాతి స్థానాల్లో నిలిచారు.   »     నటుడు, మంత్రి చిరంజీవి, హాస్యనటుడు రాజు శ్రీ వాస్తవ, భోజ్‌పురి సూపర్ స్టార్ మనోజ్ తివారీ, నటి జయప్రద, బెంగాలీ సూపర్ స్టార్ దేవ్‌లు మొదటి పది స్థానాల్లో నిలిచారు
 

అకడమియా ఆఫ్తల్మాలోజికా ఇంటర్నేషనాలిస్ (ఏఓఐ) అధ్యక్షుడిగా తెలుగువాడు

ఏప్రిల్ - 13,2014

హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ స్థాపకులు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అంతర్జాతీయ సంస్థ అకడమియా ఆఫ్తల్మాలోజికా ఇంటర్నేషనాలిస్ (ఏఓఐ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.    
»     కంటి వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ఈ సంస్థలో వివిధ దేశాలకు చెందిన 73 మంది వైద్య ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.    
»     ఈ సంస్థకు ఇప్పటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో అమెరికా, జపాన్, యూరప్‌లకు చెందిన వారే అధికంగా ఉన్నారు.    
»     ఒక భారతీయుడు ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి.
 

రెండో ఏడాదీ బ్రిట‌న్‌లో అత్యంత సంప‌న్న ఆసియ‌న్లుగా భారతీయులు (Britain's richest Asian Indians)

ఏప్రిల్ - 12,2014

పారిశ్రామిక దిగ్గజాలు హిందూజా సోద‌రులు వ‌రుస‌గా రెండో ఏడాదీ బ్రిట‌న్‌లో అత్యంత సంప‌న్న ఆసియ‌న్లుగా నిలిచారు. 13.5 బిలియ‌న్ పౌండ్లకు (సుమారు రూ.1,36,000 కోట్లు) పైగా సంప‌ద‌తో ఆసియ‌న్ల జాబితాలో అగ్రస్థానం ద‌క్కించుకున్నారు.    
»     12 బిలియ‌న్ పౌండ్ల సంప‌ద‌తో ఉక్కు దిగ్గజం ల‌క్ష్మీ మిట్టల్ రెండో స్థానంలో నిలిచారు.    
»     750 మిలియ‌న్ పౌండ్లతో ఎన్నారై పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్‌పాల్ 10వ స్థానంలో ఉన్నారు.   »     'ఈస్టర్న్ ఐ' ప్రచుర‌ణ సంస్థ ఈ జాబితాను రూపొందించింది.
http://static.indianexpress.com/m-images/Sat%20Apr%2012%202014,%2011:58%20hrs/M_Id_467199_Hinduja_brothers.jpg 

'ఫెమినా మిస్‌ ఇండియా - 2014' అవార్డు ('Femina Miss India - 2014' Award)

ఏప్రిల్ - 6,2014

'ఫెమినా మిస్‌ ఇండియా - 2014' అందాల సుందరి కిరీటాన్ని జైపూర్‌కి చెందిన కోయల్‌రాణా చేజిక్కించుకున్నారు. మొదటి రన్నరప్‌గా ముంబయికి చెందిన జటలేఖా మల్హోత్రా, రెండో రన్నరప్‌గా గోవా సుందరి గేల్‌నిఖోల్‌ డిసిల్వా నిలిచారు. ముంబ‌యిలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు 2013 మిస్‌ ఇండియా నవనీత్‌కౌర్‌ దిల్లాన్‌ ఈ కిరీటాలను అలంకరించారు.
 

Wednesday, July 30, 2014

ప్రయోగశాలలో కృత్రిమంగా కోడి మాంసం తయారుచేసిన తెలుగువాడు .

మార్చి - 22,2014
కావాల్సినంత కోడి మాంసాన్ని ప్రయోగశాలల్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు త్వరలోనే రానున్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు డాక్టర్‌ ఆర్‌.సత్యనారాయణ ఆలోచనకు ప్రతిరూపమే ఈ కృత్రిమ కోడిమాంసం.
   »    ఈ తరహా మాంసం తయారీకి సంబంధించి ఆయన ప్రతిపాదనలను కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వశాఖ ఆమోదించడంతో పాటు పరిశోధనలకు అవసరమైన నిధులనూ మంజూరు చేసింది.
   »    
గీతం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ కె.అరుణలక్ష్మి, పర్యావరణశాస్త్ర విభాగానికి చెందిన సిహెచ్‌.రామకృష్ణ సహకారంతో కోడి కండ నుంచి సేకరించిన మూలకణాల ఆధారంగా కృత్రిమ మాంసం తయారీ ప్రయోగాలు చేశారు. ఫలితాలు సానుకూలంగా రావడంతో పెద్దఎత్తున మాంసం తయారు చేసే అవకాశాలపై దృష్టి సారించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ధరకే మంచి పోషకాలున్న కృత్రిమ కోడి మాంసం అందుబాటులోకి వస్తుంది. 
   


»    ప్రయోగశాలలో కృత్రిమంగా రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ కోడి మాంసాన్ని 'ఇన్‌విట్రో చికెన్‌', 'టెస్ట్‌ట్యూబ్‌ చికెన్‌' అని అంటారు. సాధారణ కోడి నుంచి మాంసం తీసే క్రమంలో పావువంతు వృథా అవుతుంది. కృత్రిమ కోడి మాంసంలో వ్యర్థాలకు తావేలేదు. కోడి మూల కణాల నుంచి అభివృద్ధి చేయడం వల్ల రంగు, రుచి, వాసనలో ఏమాత్రం తేడా ఉండదని సత్యనారాయణ పేర్కొన్నారు.   

»    ఇన్‌విట్రో చికెన్‌లో కావాల్సిన స్థాయికి కొవ్వు శాతాన్ని పరిమితం చేసుకోవచ్చు. అవసరమైన ఇతర పోషకాల‌నూ జతచేసుకుని 'డిజైనర్‌ మీట్‌' ఉత్తత్తి చేయవచ్చు. మరోవైపు సాధారణ కోళ్లలో వచ్చే బర్డ్‌ఫ్లూ వంటి వ్యాధుల సమస్య కూడా ఉండదు.    

»    సత్యనారాయణ గ‌తంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగం (డి.ఎస్‌.టి.) నుంచి 'యువ శాస్త్రవేత్త' అవార్డు అందుకున్నారు. 

ప్రముఖ భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ఏ బ్యాంకు ప్రచారకర్తగ నియమించుకుంది?

మార్చి - 11,2014


ప్రముఖ భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌ను కెనరాబ్యాంక్ తన ప్రచారకర్తగా నియమించుకుంది.   

»    కెనడా బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే

ఏకధాటిగా 130 గంటల పాటు (అయిదు రోజుల పది గంటలు) ఉపన్యాసం ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయుడు

మార్చి - 6,2014
¤   ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని గ్రాఫిక్ ఎరా వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ బోధించే ప్రొఫెసర్ అరవింద్ మిశ్రా ఏకధాటిగా 130 గంటల పాటు (అయిదు రోజుల పది గంటలు) ఉపన్యాసం ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించారు.
   »    2009లో ఏకధాటిగా 121 గంటలపాటు ఉపన్యాసం ఇచ్చి రికార్డు సృష్టించిన ఎరోల్ ముజావజి రికార్డును మిశ్రా అధిగమించారు.

ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది ఇద్దరు భారతీయ మహిళలు ఎవరు?

మార్చి - 4,2014


ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది ఇద్దరు భారతీయ మహిళలకు చోటు దక్కింది. సావిత్రి జిందాల్, కుటుంబం 4.9 బిలియన్ డాలర్లతో, ఇందు జైన్ 2.3 బిలయన్ డాలర్లతో ఫోర్బ్స్ జాబితాకెక్కడం గమనార్హం.
   »    ఆసియాలోనే అత్యంత ధనవంతురాలిగా ఒకప్పుడు రికార్డు సృష్టించిన సావిత్రి జిందాల్ ప్రస్తుతం ఫోర్బ్స్ అంతర్జాతీయ జాబితాలో 295వ స్థానంలో నిలిచారు. బెన్నెట్ అండ్ కోల్‌మన్ అండ్ కో అధినేత్రి ఇందు జైన్ 764వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
¤
   క్రిస్టీ వాల్టన్ (జాన్ వాల్టన్ భార్య) 36.7 బిలియన్ డాలర్లతో మహిళల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానాన్ని లారియల్ అధినేత్రి లిలియాన్ బెటెన్ కోర్ట్ (34.5 బిలియన్ డాలర్లతో), మూడో స్థానాన్ని మరో వాల్టన్ కుటుంబ సభ్యురాలైన అలైస్ వాల్టన్ (34.3 బిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు.

2014 ప్రపంచంలో అత్యంత ధనికుడి ఎవరు?

మార్చి - 3,2014
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనికుడిగా నిలిచారు.  
 »    ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన 2014 వార్షిక బిలియనీర్ల జాబితాలో గేట్స్ మొదటి స్థానాన్ని సంపాదించారు. నాలుగేళ్ల అనంతరం ఆయనకు మళ్లీ ఈ స్థానం దక్కడం విశేషం.
   »    గత నాలుగేళ్లు మెక్సికోకు చెందిన టెలికాం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ ప్రథమ స్థానంలో ఉన్నారు. తాజా జాబితాలో ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.   
»    బిల్‌గేట్స్ ఆస్తి నికర విలువ 7,600 కోట్ల డాలర్లకు చేరింది. గత 20 ఏళ్లలో 15 ఏళ్లు గేట్స్ మొదటి స్థానంలో కొనసాగడం విశేషం.
   »    జాబితాలో మొత్తం 1,645 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి సగటు నికర విలువ 640 కోట్ల డాలర్లు.   
»    గతంలో ఎప్పుడూ లేని విధంగా జాబితాలో మొత్తం 172 మంది మహిళలు ఉన్నారు. గతేడాది జాబితాలో 130 మంది మహిళా బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు.   
»    2014 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో భారత్‌కు చెందిన 56 మంది సంపన్నులు చోటు దక్కించుకున్నారు.   
»    భారతీయుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 1,860 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. జాబితాలో ముకేష్ 40వ స్థానంలో నిలిచారు. ముకేష్ సోదరుడు అనిల్ అంబానీ 500 కోట్ల డాలర్ల సంపదతో 281వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2008లో ముకేష్ అంబానీ 4,300 కోట్ల డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే 5వ అత్యంత ధనవంతుడిగా నిలవడం గమనార్హం.   
»    ఇతర భారతీయుల్లో అజీమ్ ప్రేమ్‌జీ 61వ స్థానం (1,530 కోట్ల డాలర్లు), దిలీప్ సింఘ్వీ 82వ స్థానం (1,280 కోట్ల డాలర్లు), శివ్‌నాడార్ 102వ స్థానం (1,110 కోట్ల డాలర్లు), హిందుజా సోదరులు 122వ స్థానం (1,000 కోట్ల డాలర్లు), కుమార మంగళం బిర్లా 191వ స్థానం (700 కోట్ల డాలర్లు) సాధించారు.

జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఉచితంగా రోజుకు 12 నిమిషాల పాటు ఎలా మాట్లాడవోచ్చు?

మార్చి - 1,2014


బెంగళూరుకు చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ పట్టభద్రులు సి.శేఖర్, విజయ్‌కుమార్, సందేశ్ క్లౌడ్ టెలిఫోన్ ప్రొడక్ట్ ఫ్రీకాల్ ద్వారా ఉచిత టెలిఫోన్ సేవలను ప్రారంభించారు. ఈ సేవల ద్వారా జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఉచితంగా రోజుకు 12 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు.
   »    ఈ సేవలను బెంగళూరులో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు దొరైస్వామి ఆవిష్కరించారు.   
»    ఉచిత సేవలను పొందేందుకు ముందుగా 080-49202060 అనే నెంబరుకు కాల్ చేయాలి. దీనికి ఛార్జీలు పడవు. పది సెకన్ల నుంచి నిమిషం తర్వాత అదే నెంబరు నుంచి మనకు కాల్ వస్తుంది. వెంటనే కాల్‌ను స్వీకరించి మనం చేయాల్సిన ఫోన్ నెంబరుతోపాటు యాష్ (#) కొట్టి ఓకే చేస్తే సంబంధిత వ్యక్తి ఫోన్ లైన్‌లోకి వస్తారు.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి

Arturo Licata

 ఫిబ్రవరి - 28,2014
 ఇటలీకి చెందిన అటురో లికాటాను గిన్నిస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గుర్తించింది.   

» ఫ్రిబ్రవరి 28 నాటికి ఆయన వయసు 111 సంవత్సరాల 302 రోజులు.

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పరిపాలనా ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా తొలి భారతీయురాలు



ఫిబ్రవరి - 23,2014

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) పరిపాలనా ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా లక్ష్మీస్వామినాథన్ ఎన్నికయ్యారు. ఈ కీలక పదవికి ఎన్నికైన తొలి భారతీయురాలు ఆమే.   
» 1991లో ఏర్పాటైన ఏడీబీ పరిపాలనా ట్రైబ్యునల్‌లో లక్ష్మీస్వామినాథన్ కంటే ముందు ఈ పదవిని చేపట్టిన వారిలో ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు ఫిలిప్పీన్స్ దేశస్థులు, శ్రీలంక, బ్రిటన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.   
» 2010లో లక్ష్మీస్వామినాథన్ ట్రైబ్యునల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2013 నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించారు.   
» లక్ష్మీ స్వామినాథన్ గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ప్రధాన ధర్మాసనం వైస్ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.

జావేద్ అక్తర్ ప్రత్యేక గీతమ్ 'హం హే దేశ్‌కే రక్షక్' ఎవరి కోసం వ్రాసారు ?


ఫిబ్రవరి - 23,2014
¤ దాదాపు 3 లక్షల మంది సిబ్బందితో దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషిస్తున్న కేంద్ర పారామిలిటరీ బలగాల (సీఆర్‌పీఎఫ్) సేవలను కొనియాడుతూ, ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ప్రత్యేక గీతాన్ని రచించారు.
   » 'హం హే దేశ్‌కే రక్షక్' అంటూ సాగే ఈ గీతాన్ని సీఆర్‌పీఎఫ్ 75వ ఆవిర్భావ దినోత్సవమైన ఫిబ్రవరి 28న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆవిష్కరించనున్నారు.

అమెరికాలో చరిత్ర పూర్వయుగం నాటి జీవజాలాన్ని పునర్నిర్వచించేలా కీలక పరిశోధన చేసిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త

ఫిబ్రవరి -  20,2014


¤   భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త రీతూపర్ణ బోస్ అమెరికాలో చరిత్ర పూర్వయుగం నాటి జీవజాలాన్ని పునర్నిర్వచించేలా ఒక కీలక పరిశోధన నిర్వహించారు.
   »     ఓహియో, మిచిగన్ ప్రాంతాల్లో లభించిన శిలాజాలపై అధ్యయనం చేసిన ఆమె ఆ శిలాజాలు సుమారు 40 కోట్ల ఏళ్లనాటివని గుర్తించారు.
   »    ఈ శిలాజాలను గుర్తించేందుకు 'జియోమెట్రిక్ మార్ఫోమెట్రిక్స్' పేరుతో సరికొత్త పద్ధతిని ఆమె ఆవిష్కరించారు.
   »     సాధారణంగా డీఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా శిలాజాలను గుర్తించడం కచ్చితత్వంతో కూడి ఉంటుంది. కానీ, చాలా శిలాజాల్లో డీఎన్ఏ సేకరించడం కష్టమవుతుంది. కాబట్టి, అలాంటి వాటికి తాను ఆవిష్కరించిన పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని ఆమె ప్రకటించారు.
   »     రీతూపర్ణ ఆవిష్కరించిన పద్ధతిని పలు అంతర్జాతీయ జర్నల్‌లు, యూనివర్సిటీలు ప్రశంసించాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ

ఫిబ్రవరి -  17,2014
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు.   
»    ఆయనతో పాటు మరో జడ్జి రాజేశ్‌కుమార్ అగర్వాల్ చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ప్రమాణ స్వీకారం చేయించారు.   
»    వీరిద్దరి చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరింది.   
»    జస్టిస్ వెంకట రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అగర్వాల్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ, పదోన్నతి పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
justice n v ramana

ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ సంచాలకులుగా మహిళా అధికారి

ఫిబ్రవరి -  10,2014
¤  ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ సంచాలకులుగా మన రాష్ట్ర కేడర్‌కు చెందిన అరుణా బహుగుణ బాధ్యతలు చేపట్టారు.   
»    1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణా ఇప్పటివరకు సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక సంచాలకులుగా ఢిల్లీలో విధులు నిర్వర్తించారు.
   »    ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్‌లోని ఈ సంస్థకు సంచాలకులుగా ఒక మహిళా అధికారి నియమితులు కావడం ఇదే ప్రథమం.

ప్రపంచంలో అత్యంత శక్తిమంత 50 మంది వ్యాపార మహిళలతో ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) చందాకొచ్చర్‌

ఫిబ్రవరి -  7,2014
¤  ప్రపంచంలో అత్యంత శక్తిమంత 50 మంది వ్యాపార మహిళలతో ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రానూయి, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) చందాకొచ్చర్‌లకు స్థానం లభించింది.
 మేరీబారా
   »    ఫార్చ్యూన్ వ్యాపార మహిళల జాబితాలో రెండోస్థానంలో ఐబీఎం ఛైర్మన్, సీఈఒ ప్రెసిడెంట్ జిన్నీ రొమెట్టీ ఉన్నారు.
   »    జాబితాలో ఇంద్రానూయికి 3వ స్థానం కొచ్చర్‌కు 18వ స్థానం దక్కింది.

స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన మొదటి లోక్‌సభకు ఎంపికై, ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ, అరుదైన రికార్డు సొంతం చేసుకున్న 95 సంవత్సరాల రిషాంగ్ కీషింగ్

ఫిబ్రవరి - 2,2014


స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన మొదటి లోక్‌సభకు ఎంపికై, 
ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ, 
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న 95 సంవత్సరాల రిషాంగ్ కీషింగ్ 
ఇక రాజకీయాల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.
   »    రిషాంగ్ కీషింగ్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది.
   »    సోషలిస్టు పార్టీ టికెట్‌పై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, నెహ్రూ ఆహ్వానం మేరకు 1962లో కాంగ్రెస్‌లో చేరాడు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాడు. మణిపూర్ సీఎంగా కూడా పనిచేశాడు.

ప్రఖ్యాత టైమ్స్ పత్రిక కోసం 'యుగోవ్' సంస్థ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యనీయ 30 మంది వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మొదటి స్థానం

జనవరి - 12,2014


ప్రఖ్యాత టైమ్స్ పత్రిక కోసం 'యుగోవ్' సంస్థ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యనీయ 30 మంది వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచాడు.
     » భారత్ సహా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇండోనేషియా, చైనా, ఈజిస్ట్, నైజీరియా, బ్రెజిల్ (మొత్తం 13 దేశాలు)లలో 14 వేల మందిని సర్వే చేసి ఈ జాబితాను రూపొందించారు.     
» అత్యంత ఆరాధ్యనీయులైన 30 మందిలో మొత్తం ఏడుగురు భారతీయులు ఉండగా, తొలి పది మందిలో నలుగురు చోటు దక్కించుకున్నారు.     
» అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు, పోప్ ఫ్రాన్సిస్ నాలుగు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయిదో స్థానాల్లో నిలిచారు.     
» చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడి, ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం వరుసగా ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచారు.     
» జాబితాలోని 30 మందిలో మహిళలు కేవలం ఆరుగురే. వారిలో తొలిస్థానం క్వీన్ ఎలిజబెత్ దక్కించుకున్నారు.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్‌గా జనెట్ ఎలెన్

జనవరి - 7,2014

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్‌గా జనెట్ ఎలెన్ నియామకానికి సెనెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఫెడ్ రిజర్వ్‌కు తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా ఎలెన్ రికార్డు సృష్టించారు.
       »  67 ఏళ్ల ఎలెన్ ప్రస్తుతం ఫెడ్ వైస్ ఛైర్‌పర్సన్‌గా  ఉన్నారు.
  
       »  జనవరి 31న ప్రస్తుత ఛైర్మన్ బెన్ బెర్నాంకే పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

అమెరికాలోని భారత సంతతి నాడీ శాస్త్రవేత్త ఖలీల్ రజాక్‌కు అక్కడి జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) సుమారు రూ.5.21 కోట్లు (8,66,902 డాలర్లు) మంజూరు చేసింది.

జనవరి - 7,2014

అమెరికాలోని భారత సంతతి నాడీ శాస్త్రవేత్త ఖలీల్ రజాక్‌కు అక్కడి జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) సుమారు రూ.5.21 కోట్లు (8,66,902 డాలర్లు) మంజూరు చేసింది.
       »  వయసుతోపాటు వచ్చే వినికిడి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడేలా మెదడు చర్యా విధానంపై ఆయన కొద్దికాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇవి కొనసాగించేందుకు అయిదేళ్లకు ఆయనకు ఈ మొత్తం బహూకరించారు.
       »  చెన్నైకి చెందిన రజాక్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మానసిక, నాడీశాస్త్రాల సహాయ ఆచార్యుడిగా పని చేస్తున్నారు.


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) నిర్వచనాల హేతుబద్ధీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ

జూన్ - 21,2014
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) నిర్వచనాల హేతుబద్ధీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది.   
»    ఈ నివేదిక ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో 10 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులన్నింటినీ ఇక ఎఫ్‌డీఐగా పరిగణించనున్నారు. ఒక కంపెనీలో 10% కంటే తక్కువ ఉన్న పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు కానీ, తొలి కొనుగోలు తర్వాత ఏడాదిలోగా వాటాను 10 శాతానికి పైగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత కూడా వాటా 10 శాతానికి తక్కువే ఉంటే దాన్ని పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు.   
»    అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఎంత ఉన్నా, దాన్ని ఎఫ్‌డీఐగా పరిగణించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. 

ఇంధన ప్రమాణాల గురించి సౌమిత్ర చౌధురి కమిటి

జూన్ - 13,2014

దేశవ్యాప్తంగా ఇంధన ప్రమాణాలను పెంచాలని నిపుణుల కమిటీ సూచించింది.   
»    ప్రణాళికాసంఘం మాజీ సభ్యుడు సౌమిత్ర చౌధురి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. యూరో-5 ప్రమాణాలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ను ఉత్పత్తి చేయడానికి చమురుశుద్ధి కర్మాగారాలను ఆధునికీకరించాలని ఈ కమిటీ సూచించింది. దీనికి రూ.80 వేల కోట్లు అవసరమని పేర్కొంది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి పెట్రోలు, డీజిల్‌పై 75 పైసల మేర సెస్ విధించాలని తెలిపింది. 2014-15 నుంచి 2021-22 మధ్య ఏడేళ్ల వ్యవధిలో ఈ సెస్ ద్వారా రూ.64వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు.   
»    2017 నాటికి దేశవ్యాప్తంగా దశలవారీగా యూరో-4 ఇంధన ప్రమాణాలను తీసుకురావాలని, 2020 నాటికి యూరో-5 స్థాయిని అందుకోవాలని కమిటీ సూచించింది. 2024 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వస్తాయి.   
»    ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్, లక్నో తదితర 26 నగరాల్లో యూరో-4 (బీఎస్-4) ప్రమాణాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల బీఎస్-3 స్థాయి అమల్లో ఉంది.   
»    చమురుశుద్ధి కర్మాగారాల ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు వీలుగా డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని కమిటీ సూచించింది. పెట్రోల్ ధరలపై నియంత్రణను 2010 జూన్‌లో తొలగించారు.
saumitra chaudhuri

ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ విధివిధానాలను రూపొందించే కమిటీకి అధ్యక్షుడిగా నాబార్డ్ మాజీ ఛైర్మన్

జూన్ - 9,2014


ఆంధ్రప్రదేశ్ రుణమాఫీ విధివిధానాలను రూపొందించే కమిటీకి అధ్యక్షుడిగా నాబార్డ్ మాజీ ఛైర్మన్ కోటయ్య నియమితులయ్యారు.   
»    సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సి.ఎస్.రావు, ఆర్థిక నిపుణుడు కుటుంబరావు, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం, గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి ఎస్.పి.ఠక్కర్‌లు నియమితులయ్యారు. ఆర్థికశాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
Kotaiah committe

కొత్త బ్యాంక్ లైసెన్సుల కోసం బిమల్‌జలాన్ కమిటీ 2014 (Bimaljalan committee for new bank licenses)

ఫిబ్రవరి - 25,2014


కొత్త బ్యాంక్ లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించిన ఉన్నత స్థాయి సలహా సంఘం బిమల్‌జలాన్ కమిటీ తన నివేదికను రిజర్వ్ బ్యాంక్‌కు అందజేసింది.   
»   ఈ నివేదికలో బ్యాంక్ లైసెన్సులు అందుకోవడానికి అర్హత ఉన్న కంపెనీల పేర్లున్నాయి.   
»   కమిటీ సభ్యుల్లో ఆర్‌బీఐ పూర్వ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ పూర్వ ఛైర్మన్ సి.బి.భావే, ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు చెందిన నచికేత్ మోర్ ఉన్నారు.   
»   ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సీఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగంలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్ పైజెస్, శ్రీరాం కేపిటల్ సహా మొత్తం 25 సంస్థలు బ్యాంక్ లైసెన్సుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాయి.
bimal jalan

జస్టిస్ ఎం.బి.షా కమిషన్ 2014(justice m b Shah Commission 2014)

జనవరి - 2,2014


ఒడిశాలో జరిగిన గనుల అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎం.బి.షా కమిషన్ అయిదు సంపుటాల తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఒడిశాలో ఏటా 55 మిలియన్ టన్నులకు మించి ఇసుక ఖనిజాన్ని తవ్వకూడదనే పరిమితి విధించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
          » జస్టిస్ ఎం.బి.షా కమిషన్ సమర్పించిన నివేదికను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పరిశీలించింది. షా కమిషన్ నివేదిక నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కోసం వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2013 (kendraSahitya Akademi Award 2013)

డిసెంబరు - 18,2013


తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కాత్యాయని విద్మహే కి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.      
»  తెలుగులో స్త్రీల కవిత్వ - కథ - అస్తిత్వ చైతన్యంపై కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' అనే వ్యాస సంకలనానికి ఈ పురస్కారం లభించింది.
      »  కాత్యాయని విద్మహే వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.      
»  మొత్తం 24 అధికార భాషలకు 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అస్సామీస్, గుజరాతీ భాషలకు పురస్కారాన్ని ప్రకటించలేదు.      
»  ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత, స్క్రిప్ట్ రచయిత జావేద్ అక్తర్, ప్రముఖ హిందీ నవలా రచయిత్రి మృదులాగార్గ్, ప్రముఖ బెంగాలీ కవి సుబోధ్ సర్కార్ తదితరులు ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు.      
»  జావేద్ అక్తర్ కలం నుంచి జాలువారిన 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా'కు, మృదులాగార్గ్ రచించిన 'మిల్ జుల్ మన్' నవలకు ఈ పురస్కారం లభించింది.      
»  కవితల విభాగంలో ఎనిమిది పుస్తకాలను, నాలుగు వ్యాసాలను, మూడు నవలలను, రెండు కథలను, రెండు ట్రావెలాగ్‌లను, ఒక స్వీయ చరిత్రను, జ్ఞాపకాల విభాగంలో ఒక పుస్తకాన్ని, ఒక నాటకాన్ని ఈ పురస్కారానికి సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. నాటకం విభాగంలో ఒడిశాకు చెందిన బిజయ్ మిశ్రా ఎంపికయ్యారు. ఆయన రచించిన 'వన ప్రస్తా' అనే నాటకానికి ఈ పురస్కారం లభించింది.      
»  వరంగల్ జిల్లాకు చెందిన సాహిత్యవేత్తలకు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. ప్రముఖ నవలా కారుడు అంపశయ్య నవీన్ తెలంగాణ సంస్కృతి, ప్రజల జీవన విధానాలపై రాసిన 'కాలరేఖలు' నవలకు 2004లో తొలిసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.      »  2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు రూ.లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను ప్రదానం చేయనున్నారు.
Javed Akhtar
mridula garg
subodh sarkar
bijay misra

Katyayni vidhmahe