Thursday, July 31, 2014

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు మహిళ

ఏప్రిల్ - 21,2014

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.రోహిణి బాధ్యతలు స్వీకరించారు.     
»     ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సమక్షంలో జస్టిస్ రోహిణి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.    
»     ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ రోహిణిని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవలే నియమించారు.    
»     రాష్ట్రానికి చెందిన జస్టిస్ రోహిణికి ముందు ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ కూడా రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. జస్టిస్ రమణ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లారు.   
»     జస్టిస్ రోహిణి 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1980లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2001లో అదనపు జడ్జిగా, 2002లో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు.
 

No comments:

Post a Comment