Wednesday, July 30, 2014

ఎ రికగ్నైజ్డ్ లీడర్ ఇన్ హిస్ స్పెషాలిటీ పురస్కారం 2014 (A leader in his specialty recognised Award 2014)

 జూన్ - 21,2014

భారత్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకి ప్రతిష్ఠాత్మక 'ఎ రికగ్నైజ్డ్ లీడర్ ఇన్ హిస్ స్పెషాలిటీ' పురస్కారం లభించింది.   
»    న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది.   
»    ప్రస్తుతం నోరి దత్తాత్రేయుడు న్యూయార్క్ క్వీన్స్ అండ్ కార్నెల్ ఆస్పత్రి ఛైర్మన్‌గా, అమెరికాలోని అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.   
»    క్యాన్సర్ వ్యాధికి సంబంధించి న్యూమరస్ క్లినికల్ ట్రయల్స్, థెరపిటిక్ రేడియాలజీ అండ్ అంకాలజీ తదితర వాటిపై ఆయన అత్యున్నత పరిశోధనలు చేశారు. ఇటీవల క్యాన్సర్ వైద్యం కోసం అమెరికా వెళ్లిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి న్యూయార్క్‌లో వైద్యసేవలు అందించింది కూడా నోరి దత్తాత్రేయుడే.   
»    ఆయన కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 

No comments:

Post a Comment