Thursday, July 24, 2014

కీర్తిచక్ర పురస్కారం 2014

జనవరి - 25,2014

ప్రాణాలొడ్డి ఆరుగురు కమాండోలను కాపాడిన వీర జవాను నందన్ చౌధురికి భారత ప్రభుత్వం 'కీర్తిచక్ర' ప్రకటించింది. పరమ వీరచక్ర తర్వాత రెండో అత్యంత విశిష్ట సేవా పతకం కీర్తిచక్ర.     
 »   2012లో బీహార్‌లోని అటవీ ప్రాంతంలో మవోయిస్టులను నందన్ వీరోచితంగా ఎదుర్కొన్నారు. నందన్ బృందం లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా మావోలను ఎదిరించి నిలిచాడు.     
 »   విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన భారత వైమానికదళ పైలెట్ డి. కాస్టెలినో, చౌధురిలకు సంయుక్తంగా కీర్తిచక్ర ప్రకటించారు. కేదారనాథ్ ఆలయం వద్ద వరదలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపడుతూ విధి నిర్వహణలో హెలికాప్టర్ కూలి కాస్టెలినో వీర మరణం పొందాడు.     
 »   గణతంత్ర వేడుకల్లో పోలీసులకు ఇచ్చే విశిష్ట పురస్కారాలకు దేశవ్యాప్తంగా 766 మంది ఎంపికైనట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. పురస్కార గ్రహీతల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 33 మంది ఉన్నారు.     
 »   ఢిల్లీలో 1984 అల్లర్ల తర్వాత శాంతి స్థాపనకు కృషి చేసినందుకు మొహిందర్ సింగ్, విద్యావేత్త ఎన్.రాధాకృష్ణన్ మత సామరస్య పురస్కారానికి ఎంపికయ్యారు.
 
రాష్ట్రం నుంచి రాష్ట్రపతి విశిష్ట పోలీసు పతకానికి ఎంపికైనవారు: ఏపీఎస్ఆర్‌టీసీ ఎండీ, అదనపు డీజీపీ జె.పూర్ణచంద్రరావు; విశాఖపట్నం డీఐజీ పి.ఉమాపతి, ఏపీఎస్పీ డీఐజీ టి.యోగానంద్, కర్నూలు డీఐజీ టి.మురళీకృష్ణ.


No comments:

Post a Comment