Saturday, July 26, 2014

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు 2013 (Dada Saheb Phalke Award 2013)

ఏప్రిల్ - 12,2014

కవిగా, రచయితగా, కథకుడిగా, దర్శకుడిగా, సంభాషణల రచయితగా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన గుల్జార్‌కు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన 'దాదా సాహెబ్‌ ఫాల్కే' పురస్కారాన్ని ప్రకటించింది   
»    గుల్జార్‌ అసలు పేరు సంపూరణ్‌ సింగ్‌ కర్లా. గుల్జార్ అతడి కలం పేరు. 1934లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని దీనా అనే చిన్న పట్టణంలో జన్మించారు. దేశ విభజన సమయంలో అత‌డి కుటుంబం అమృత్‌సర్‌కి వలస వచ్చింది.   
»    'బందిని' చిత్రంతో గుల్జార్ గీతరచయితగా పరిచయమయ్యారు. ఎస్‌.డి. బర్మన్‌, ఆర్‌.డి. బర్మన్‌, శంకర్‌ జైకిషన్‌, ఎ.ఆర్‌. రెహమాన్‌ లాంటి ఎందరో హేమాహేమీల్లాంటి సంగీత దర్శకులు ఆయ‌న పాట‌ల‌కు స్వర‌క‌ల్పన చేశారు. కిషోర్‌కుమార్‌, లతామంగేష్కర్‌, ఆశాభోంస్లే లాంటి గాయనీగాయకుల గ‌ళాల్లో గుల్జార్‌ రాసిన పాటలు సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.   
»    2010లో స్లమ్ డాగ్ మిలియ‌నీర్ చిత్రంలోని 'జయహో గీతానికి ఆయన రెహమాన్‌తో కలసి ఆస్కార్‌ను అందుకున్నారు. ఇదే పాటకు గ్రామీ కూడా దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అయిదు జాతీయ పురస్కారాలు, ఇరవై ఫిల్మ్‌ఫేర్ పుర‌స్కారాలు గుల్జార్‌ను వ‌రించాయి. 2004లో భారత ప్రభుత్వం 'పద్మభూషణ్‌' పురస్కారంతో సత్కరించింది.  
 »    గజల్స్‌ ప్రక్రియలో గుల్జార్‌ సరికొత్త ప్రయోగం చేశారు. 'త్రివేణీ' పేరుతో మూడు పంక్తుల్లో ముగిసే గజల్స్‌కి రూపకల్పన చేశారు   
»    పిల్లల వ్యక్తిత్వ వికాసాలకు ఉపయోగపడే రచనల‌ను చేశారు. దూరదర్శన్‌లో విశేష ఆదరణ పొందిన 'జంగిల్‌ బుక్‌' సిరీస్‌కు గీత రచయిత ఈయనే. పాటల రూపంలో ఉండే కథలుగా ఈయన రాసిన 'కరాడీ టేల్స్‌' చిన్నపిల్లల‌ను అమితంగా ఆకట్టుకున్నాయి.   
»    సినీ ప‌రిశ్రమ‌కు సంబంధించి దేశంలోనే అత్యున్నత పుర‌స్కార‌మైన దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారాన్ని అందుకుంటున్న 45వ వ్యక్తిగా గుల్జార్ నిలిచారు.   
»    ఈ అవార్డు కింద స్వర్ణక‌మ‌లంతో పాటు రూ.10 ల‌క్షల న‌గ‌దు, శాలువా అంద‌జేస్తారు.
2013
1969- దేవిక రాణి, actress


1970- B. N. సిర్కార్ , producer

1971- ప్రిత్విరాజ్  కపూర్ , actor (posthumous)

1972- Pankaj Mullick, composer (music director)
Meet all the 45 Dadasaheb Phalke Award winners ever
1973- Ruby Myers (Sulochana), actress

1974- Bomireddi Narasimha, Reddy director

1975- Dhirendranath Ganguly, actor, director

1976- Kanan Devi, actress

1977- Nitin Bose, cinematographer, director, writer

1978- Rai Chand Boral, composer, director

1979- Sohrab Modi, actor, director, producer

1980- Paidi Jairaj, actor, director 

1981- Naushad Ali, composer (music director) 

1982- L. V. Prasad, actor, director, producer

1983- Durga Khote, actress

1984- Satyajit Ray, director

1985- V. Shantaram, actor, director, producer

1986- B. Nagi Reddy, producer

1987- Raj Kapoor, actor, director

1988- Ashok Kumar, actor

1989- Lata Mangeshkar, singer

1990- A. Nageswara Rao, actor

1991- Bhalji Pendharkar, director, producer, writer

1992- Bhupen Hazarika, composer (music director)

1993- Majrooh Sultanpuri, lyricis

1994- Dilip Kumar, actor

1995- Dr. Rajkumar, actor

1996- Sivaji Ganesan, actor

1997- Pradeep,lyricist

1998- B.R. Chopra, director, producer

1999- Hrishikesh Mukherjee, director

2000- Asha Bhosle, singer

2001- Yash Chopra,director, producer 

2002- Dev Anand, actor, director, producer

2003- Mrinal Sen, director 

2004- Adoor Gopalakrishnan, director

2005- Shyam Benegal, director

2006- Tapan Sinha, director

2007- Manna Dey, singer

2008- V.K. Murthy, cinematographer

2009- D.Ramanaidu, producer, director

2010- K. Balchander, director

2011- Soumitra Chatterjee, actor

2012-pran,actor

2013-సంపూరణ్‌ సింగ్‌ కర్లా(గుల్జార్‌)



No comments:

Post a Comment